Lavanya Tripathi : పెళ్లి తర్వాత ఫస్ట్ వెబ్ సిరీస్‌తో రాబోతున్న లావణ్య త్రిపాఠి.. ఏం సిరీస్? ఏ ఓటీటీలో ?

పెళ్లి తర్వాత లావణ్య మొదటిసారి ఈ సిరీస్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Lavanya Tripathi announced her first web series Miss Perfect after her marriage

Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవలే కొన్ని నెలల క్రితం మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) ని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేసింది కొత్త జంట ఇన్ని రోజులు. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అంటున్నారు. ఆల్రెడీ వరుణ్ మట్కా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. లావణ్య చేతిలో ఓ తమిళ్ సినిమా ఉంది. దాంతో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది.

లావణ్య ఇప్పుడు తన నెక్స్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా మారనుంది. లావణ్య త్రిపాఠి, అభిజీత్, అభిజ్ఞ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ‘మిస్ పర్ఫెక్ట్'(Miss Perfect) అనే సిరీస్ త్వరలో రానుంది. ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్‌స్టార్”(Disney Plus Hotstar) లో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు.

Also Read : Saindhav : వెంకీ మామ 75వ సినిమా ‘సైంధవ్‌’ ట్రైలర్ రిలీజ్.. మా నాన్న సూపర్ హీరో.. మాస్ ఎమోషనల్

ఈ సిరీస్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. పెళ్లి తర్వాత లావణ్య మొదటిసారి ఈ సిరీస్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సిరీస్ కామెడీ డ్రామాగా సాగానున్నట్టు సమాచారం. ఇక ఈ సిరీస్ ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. త్వరలో ఈ మిస్ పర్ఫెక్ట్ సిరీస్ ప్రమోషన్స్ తో లావణ్య ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సిరీస్ తో లావణ్య ప్రేక్షకులని ఎలా మెప్పిస్తుందో చూడాలి. లావణ్య గతంలో ఆల్రెడీ పులి మేక అనే వెబ్ సిరీస్ తో మెప్పించింది.

ట్రెండింగ్ వార్తలు