Saindhav : వెంకీ మామ 75వ సినిమా ‘సైంధవ్‌’ ట్రైలర్ రిలీజ్.. మా నాన్న సూపర్ హీరో.. మాస్ ఎమోషనల్

తాజాగా సైంధవ్‌ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.

Saindhav : వెంకీ మామ 75వ సినిమా ‘సైంధవ్‌’ ట్రైలర్ రిలీజ్.. మా నాన్న సూపర్ హీరో.. మాస్ ఎమోషనల్

Venkatesh 75th Movie Saindhav Trailer Released

Updated On : January 3, 2024 / 12:10 PM IST

Saindhav Trailer : హిట్ సినిమా ఫేం శైలేష్‌ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) తన 75వ సినిమాగా ‘సైంధవ్‌’తో రాబోతున్నాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ లో చూపించిన దాని బట్టి.. సైంధవ్‌(వెంకటేష్) గత జీవితం వదిలేసి తన పాప కోసం బతుకుతుంటాడు. పాపకి ఓ అరుదైన వ్యాధి వస్తుంది. పాపకి ఓ ఇంజెక్షన్ ఇస్తే బతుకుతుంది. కానీ దాని విలువ 17 కోట్లు. దీంతో సైంధవ్‌ ఏం చేశాడు. మళ్ళీ తన గతంలోకి వెళ్లాడా? సైంధవ్‌ అంతకు ముందు అసలు ఏం చేశాడు అనే దానిపై కథ ఉండబోతుంది. తండ్రి కూతురు సెంటిమెంట్ తో ఫుల్ మాస్ యాక్షన్ గా సైంధవ్‌ ఉండబోతుందని తెలుస్తుంది.

Also Read : Venky 75 Event : వెంకీ మామ 75 సినిమాల సెలబ్రేషన్స్ ప్రోమో చూశారా? ఫుల్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్?

ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. తదితరులు నటిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.