Lavanya Tripathi
Lavanya Tripathi : మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుంది. లావణ్య మెయిన్ లీడ్ లో నటించిన సతీ లీలావతి సినిమా మార్చ్ 6న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య, మూవీ టీమ్ యాంకర్ సుమతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.(Lavanya Tripathi)
లావణ్య కొన్ని నెలల క్రితమే పండంటి బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు చేసిందట. అప్పుడు తను ఎదుర్కున్న హెల్త్ కండిషన్స్ గురించి తెలిపింది.
Also Read : Anupama Parameswaran : ఏంటి నిజమేనా..? తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో అనుపమ ప్రేమాయణం..?
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. షూటింగ్ వర్క్స్ అన్ని మొదలయ్యాక నో అని చెప్తే వాళ్లకు లాస్ అని ప్రగ్నెంట్ గానే షూటింగ్ చేశాను. వాంతులు చేసుకొని షూట్ కి వెళ్లేదాన్ని, మైగ్రేన్ ఉండేది ట్యాబ్లేట్స్ వేసుకొని షూట్ చేసేదాన్ని. యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పుడు చాలా భయపడ్డాను. ప్రతి షూట్ షెడ్యూల్ అయ్యాక హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకునేదాన్ని. బేబీ బంప్ కనిపిస్తుందని 3 నెలల లోపే షూటింగ్ పూర్తిచేసేసారు. డ్యాన్స్ కి కూడా భయం వేసింది. లేడీ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ అర్ధం చేసుకొని దానికి తగ్గట్టు స్టెప్స్ కంపోజ్ చేసారు.
కాస్ట్యూమ్స్ కూడా లూజ్ గా ఉండేలా స్పెషల్ గా చేయించాము కాస్ట్యూమ్ డిజైనర్ కి చెప్పి. నాలుగో నెలలో కూడా ప్యాచ్ వర్క్ ఉంటే చేయాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళు ఈ సమయంలో షూటింగ్ అవసరమా అని కాస్త భయపడ్డారు కానీ సపోర్ట్ చెప్పారు. వరుణ్ అయితే నాకు బిగ్గెస్ట్ సపోర్ట్. డాక్టర్ ఎక్కువ ట్రావెల్ చేయొద్దు అన్నారు కానీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో. పొద్దున్నే లేచి ట్రావెల్ చేయాలి రోజూ. అప్పుడు ఇబ్బంది పడ్డాను. కార్ లో అంత దూరం ప్రయాణిస్తే కాస్త అన్ ఈజీగా అనిపించేది. భయంతోనే సినిమా షూటింగ్ చేశాను. షూటింగ్ లో కూడా ప్రగ్నెన్సీ అని ఎవరికీ తెలీదు. తెలిస్తే అందరూ స్పెషల్ గా చూస్తారు అందుకే ఎవ్వరికి చెప్పలేదు అని తెలిపింది.
దీంతో లావణ్య వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ప్రగ్నెన్సీలో కూడా రిస్క్ చేసి మూవీ షూటింగ్ చేసిందంటే సినిమాపై ఆమె డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో డైరెక్టర్ సత్య మాట్లాడుతూ.. ఆమెతో ఫైట్ సీక్వెన్స్ కూడా చాలానే చేయాలి అనుకున్నా. కానీ షూటింగ్ మొదటి రోజే ఒక సీన్ షూట్ చేయగానే పిలిచి నేను ప్రగ్నెంట్ అని చెప్పింది. షాక్ అయ్యా. ఏం చేయాలో అర్ధం కాలేదు. షూటింగ్ లో ఎవరికీ తెలీదు. నిర్మాతకు చెప్తే భయపడతారేమో అనుకున్నా. అందుకే చెప్పకుండా నెల రోజులు షూట్ చేసాము. ఒక నెల రోజులు తర్వాత నిర్మాతకు చెప్తే అర్ధం చేసుకున్నారు అని అన్నారు.