Lavanya Tripathi : లావణ్య త్రిపాఠిని చీప్ యాక్టర్ అన్న నెటిజన్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య
తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఓ నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ట్యాగ్ చేయడంతో ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ''లావణ్య త్రిపాఠి.........
- Saketh U
- Published on- February 1, 2022 / 12:50 PM IST
Lavanya
Lavanya Tripathi : చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో సెలబ్రిటీలని ట్రోల్ చేస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ కొంతమంది మాత్రం ట్రోల్ చేసిన వారికి గట్టిగానే కౌంటర్ ఇస్తారు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు నెటిజన్లకు డైరెక్ట్ గానే కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఓ నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే… తమిళనాడులో క్రైస్తవ మతం స్వీకరించనందుకు కొందరు లావణ్య అనే మైనర్ బాలికను వేధింపులకు గురి చేయగా ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ చనిపోయిన మైనర్ బాలికకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో లావణ్య పేరుతో హ్యాష్ ట్యాగులను క్రియేట్ చేసి పోస్టులు చేశారు. అందులో కొందరు లావణ్య పేరుతో పాటు లావణ్య త్రిపాఠిని కూడా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి జత చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్స్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
సమ్మర్లో స్టార్ హీరోల సినిమాల సందడి
హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ట్యాగ్ చేయడంతో ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ”లావణ్య త్రిపాఠి హ్యాష్ ట్యాగ్ ని వాడకండి. ఆమె నటి. చనిపోయిన లావణ్య తమిళనాడుకి చెందిన ఒక మాములు అమ్మాయి. ఆ మైనర్ బాలిక ధర్మం కోసం చనిపోతే, ఆమెను చీప్ నటితో ఎందుకు పోలుస్తున్నారు” అంటూ పోస్ట్ చేశాడు.
Rakul Preet Singh : వెబ్ సిరీస్‌లు చేస్తాను.. కానీ.. రకుల్ కండిషన్స్
దీనికి లావణ్య త్రిపాఠి గట్టిగానే స్పందించింది. ఈ పోస్ట్ కి లావణ్య.. ‘‘ఏదైనా చెడు సంఘటన జరిగినప్పుడు మాత్రమే నీలాంటి వాళ్లు మహిళలను గౌరవిస్తారు. అంతకు ముందు నీలాంటి వాళ్లే మహిళలను చీప్ అంటారు. అందరిని గౌరవించడం నేర్చుకో. ఇది చాలా బాధాకరమైన ఘటన. కానీ సమాజంలో వాస్తవ పరిస్థితి ఇదే’’ అంటూ ఆ నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
