Lavanya Tripathi updated his instagram name with konidela tag
Lavanya Tripathi : టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి మెగా కుటుంబానికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ తేజ్ ని పెళ్లి చేసుకొని కొణిదెల ఇంటి అడుగు పెట్టారు లావణ్య. ఇటీవలే ఈ జంట హనీమూన్ ట్రిప్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. ఇక తమ కెరీర్స్ పై దృష్టి పెట్టారు ఈ జంట. ఇది ఇలా ఉంటే, లావణ్య తన సోషల్ మీడియాలో తన కొత్త ఇంటి పేరుని అప్డేట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ లో మొన్నటి వరకు లావణ్య త్రిపాఠి అని ఉండేది. ఇప్పుడు దాని కాస్త ‘లావణ్య త్రిపాఠి కొణిదెల’ అని అప్డేట్ చేశారు. ఇక ఈ విషయాన్ని మెగా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొణిదెల ట్యాగ్ తో లావణ్యని చూడడం ఆనందంగా ఉందంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రమే ఆమె పేరు మార్చారు. ఎక్స్ (X)లో లావణ్య అనే పేరే ఉంది.
Also read : Sandeep Vanga : బాలీవుడ్‌లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి.. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఇతర సినిమాలపై..
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ‘ఆపరేషన్ వాలంటైన్’ షూటింగ్ పూర్తి చేసి, ‘మట్కా’ షూటింగ్ ని మొదలు పెట్టారు. 2024 ఫిబ్రవరిలో ఆపరేషన్ వాలంటైన్ విడుదల కాబోతోంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
మట్కా విషయానికి వస్తే.. కరుణ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. 1958-1982 మధ్య జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నారు. నోరా ఫతేహీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.