Son of Kanaka Durgamma : అమ్మవారి అవతారంలో లయ.. ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ పోస్టర్ అదిరిందిగా!

Son of Kanaka Durgamma : లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ.

Laya first look from Son of Kanaka Durgamma movie

Son of Kanaka Durgamma : లయ, అనురూప్ కటారి, ఆకాంక్ష త్యాగరాజన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం సన్ ఆఫ్ కనకదుర్గమ్మ. ఈ చిత్రానికి దుర్గ ఫణిదర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్ జానర్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని రాగా మూవీస్, తిలోత్తమ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వాణి శంకర్, తిలోత్తమ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక దసరా పండుగ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

నటి లయ అమ్మవారి పాత్రలో కనిపిస్తున్న పవర్‌ఫుల్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, స్వప్న దత్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. నిధి అన్వేషణ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అమ్మవారి రూపంలో లయ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.

Viraajita : పండ‌గ పూట చీర‌క‌ట్టులో యూట్యూబ‌ర్ విరాజిత‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు వైర‌ల్..

శశిధర్ లంక సంగీతం అందిస్తుండగా సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్ల‌డించ‌నున్నారు.