Rayavalsa : రాయవలస రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడంటే?
Rayavalsa : కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాయవలస.
Rayavalsa Movie Release date Fix
Rayavalsa : కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం రాయవలస. ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి డైరెక్షన్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ జె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా నుంచి టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న కార్తీక్ జయంతి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం కానున్నారు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల విడుదలైన ‘రింగుడు రింగుడు’ పాట యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి మంచి స్పందనను సొంతం చేసుకుంది.
Anchor Sravanthi : దసరా స్పెషల్.. యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్..

దసరా సందర్భంగా చిత్ర బృందం మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలైన పోస్టర్లో హీరో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తుండగా, వెనుక అమ్మవారి రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి అర్జున్ బాల సంగీతం అందిస్తున్నారు.
