ఇండియన్ లీడింగ్ ఫిల్మ్ మేకర్స్ ఐదుగురు కలిసి కరోనావైరస్ మహమ్మారిపై ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఫిల్మ్ మేకర్ అనుభవ్ సిన్హా బెనారస్ మీడియా వర్క్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. కేటాన్ మెహతా, సుధీర్ మిశ్రా, హన్సాల్ మెహతా, సుభాశ్ కపూర్ లు కూడా సినిమా నిర్మాణ యూనిట్ లో ఉన్నారు.
గతంలో మాట్లాడిన దానికంటే ఎక్కువగా కొద్ది నెలలుగా లాక్ డౌన్ సమయంలో మాట్లాడుతూ ఉన్నాం. ప్రపంచమంతా మహమ్మారి గురించి చర్చించుకుంటుంది. మనం చాలా పెనుమార్పులు చూస్తున్నాం. ఇవన్నీ దాచి ఉంచాల్సిన సంగతులు. చాలా కథలను చెప్పాలనుకుంటున్నాం. మేమంతా కలిసి అద్భుతమైన ప్రాజెక్టును తెరకెక్కించనున్నాం.
షారూఖ్ తో రా.వన్ సినిమా తీసింది సిన్హానే. అంతేకాకుండా రిషి కపూర్, తాప్సీ పన్నూలతో ఆర్టికల్ 15. ఆయుష్మాన్ ఖురానాతో తప్పడ్ తీశారు.