Leo Cinematographer Manoj Paramahamsa Interesting Comments on Leo Movie Flash Back
Manoj Paramahamsa : లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) సినిమాటిక్ యూనివర్స్(LCU) లో భాగంగా ఇటీవల విజయ్(Vijay) లియో(Leo) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ పై ఉన్న అంచనాలతో ఈ సినిమాకు భారీ హైప్ ఏర్పడింది. లియో సినిమాకు తమిళ్ లోనే కాకుండా బయట కూడా ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ లియో సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. లియో సినిమాలో ఫస్ట్ హాఫ్ మధ్యలో నుంచే హీరో లియో నా కాదా అని సినిమా చివరి వరకు సాగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో లియోకి సంబంధించి ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఇది జైలులో ఉండే ఓ వ్యక్తి చెప్తాడు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ అంత సూపర్ గా ఏమి అనిపించలేదు, అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ సినిమాని కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకొస్తున్నట్టు ఖైదీ, విక్రమ్ సినిమాల నుంచి ఓ రెండు క్యారెక్టర్స్ తీసుకొచ్చి ఇంప్రెస్ చేయాలనుకున్నా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే తాజాగా లియో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పై సినిమా కెమెరామెన్ మనోజ్ పరమహంస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Guntur Kaaram : గుంటూరు కారం షూటింగ్ అయిపోయిందా? అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టి..
లియో సక్సెస్ తర్వాత కెమెరామెన్ మనోజ్ పరమహంస తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లియో సినిమాలో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఒక ఫేక్ స్టోరీ కూడా కావొచ్చు. అసలు ముందు కథలో ఫ్లాష్ బ్యాక్ లేదు. అందుకే ఫ్లాష్ బ్యాక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు లోకేష్. జైలులో మన్సూర్ చెప్పిన స్టోరీ అబద్దం అయి కూడా ఉండొచ్చు అని అన్నాడు. దీంతో LCU అభిమానులు లోకేష్ ఇంకేం స్కెచ్ వేశాడో, లియోకి సీక్వెల్ ఉంటుందా? మరి లియో దాస్ ఉన్నాడా లేడా? లియో ఫ్లాష్ బ్యాక్ ఇంకేదైనా సినిమాకి కనెక్ట్ చేస్తాడా అని కామెంట్స్ చేస్తూ లోకేష్ రాబోయే సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కెమెరామెన్ మనోజ్ పరమహంస ఒక్క ఇంటర్వ్యూలో లియో సినిమాపై అందరికి ఏర్పడిన అభిప్రాయమే మార్చేసి లోకేష్ రాబోయే సినిమాలపై మరింత ఆసక్తి పెంచేలా చేశాడు.
#LEO : LEO DAS May Be FAKE⭐#ManojParamahamsa : " Flashback Can Be FAKE Too? @Dir_Lokesh Said We just N Ed To Show Few Minutes Of The #LeoDas Portion? Even The Stranger #MansoorAliKhan Narrating This Portion May Be FAKE Too? "
Enna Pudhu Twistuu?️⚡#ThalapathyVijay pic.twitter.com/AEO6oNu0Fw
— #LeoOfficial_2.0 (@Vijay_fan_world) October 21, 2023
#Leo Das Flashback is FAKE ??
– DOP Manoj Paramahamsapic.twitter.com/MJEn8TWm5M— MAHI ? – Infinity Plus YouTube (@MahilMass) October 21, 2023
Words of #Leo DOP Manoj Paramahamsa ~
" Actually this film doesn't need a flashback.. LokeshKanagaraj's initial idea was not to focus on Flashback "
So The Flashback which Mansoor Alikhan narrated could be a Lie..?
That's Why … The Tease the audience .. He Wantedly… pic.twitter.com/BEnxruFzqe
— Roвιɴ Roвerт (@PeaceBrwVJ) October 21, 2023