Leo Movie : ఒకే సినిమాకి మూడు క్లైమాక్స్‌లు.. లియో సినిమా ఒక్కో చోట ఒక్కోలా.. ఏంటయ్యా లోకేష్ ఇది?

తాజాగా లియో సినిమాకు మూడు వెర్షన్స్ క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయని, ఒక్కోచోట ఒక్కో వర్షన్ రిలీజ్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ వాడుతుంది.

Leo Movie Released Three Different Versions Climaxes in Different places

Leo Movie : లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో విజయ్(Vijay) హీరోగా ఇటీవల లియో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. లియో సినిమా విజయ్ అభిమానులని మెప్పించినా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అభిమానులని మాత్రం నిరాశ పరిచింది. అలాగే తమిళనాడు బయట లియో సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినా కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి.

ఇప్పటికే లియో సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. లియో సినిమా ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అవ్వొచ్చని, ఆ కథ చెప్పిన ఖైదీ అబద్దం చెప్పి ఉండొచ్చని, లియో కథ వేరే ఉండొచ్చని.. ఇలా పలు కామెంట్స్ చేసి సినిమా కెమెరామెన్ మనోజ్ పరమహంస సినిమా గురించి మరోసారి ఆలోచించేలా చేసాడు. అంతేకాకుండా లోకేష్ వచ్చే సినిమాలపై ఆసక్తిని పెంచాడు. తాజాగా లియో సినిమాకు మూడు వెర్షన్స్ క్లైమాక్స్ సీన్స్ ఉన్నాయని, ఒక్కోచోట ఒక్కో వర్షన్ రిలీజ్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ వాడుతుంది.

తెలుగు, తమిళ్ లో క్లైమాక్స్ లో.. హీరోనే లియో అని లాస్ట్ కి అర్జున్ ని చంపే ముందు చూపిస్తాడు, అప్పుడే సంజయ్ దత్ ని చంపేటప్పుడు కూడా చెప్పినట్టు చూపిస్తాడు. దీంతో క్లైమాక్స్ వరకు హీరోనే లియో అని తెలీదు. ఇక అమెరికాలో.. సంజయ్ దత్ కి అసలు ఇతనే లియో అని చెప్పడని, కేవలం అర్జున్ కి మాత్రమే చెప్తాడని వర్షన్ ని రిలీజ్ చేశారు. ఇక మలేషియా, మరి కొన్ని చోట్ల.. ముందే సంజయ్ దత్ ని చంపేటప్పుడే లియో అని తెలిసేలా చేసి, అర్జున్ ని చంపడానికి లియోనే వెళ్లినట్టు చూపించాడట.

Also Read : Bigg Boss 7 Day 49 : మళ్ళీ లేడి కంటెస్టెంట్ అవుట్.. ఇంకో లేడి కంటెస్టెంట్ రీ ఎంట్రీ.. ఏంటో ఈసారి బిగ్‌బాస్..

ఇలా మూడు వెర్షన్స్ ఎందుకు రిలీజ్ చేశారు? కావాలనే రిలీజ్ చేశారా? లేదా ఎడిటింగ్ చూసుకోకుండా వేరే కాపీలను పంపించారా? ఈ విషయంలో లోకేష్ ఇంకేదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నాడా అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొత్తానికి లియో సినిమాపై నెగిటివిటి వచ్చినా రోజుకొక కొత్త చర్చతో సినిమాపై మరింత ఆసకిని పెంచేలా చేస్తున్నారు.