హీరో పెద్ద మనసు : అమెజాన్ సంరక్షణకు రూ.36 కోట్లు విరాళం

అమెజాన్‌ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘ఎర్త్‌ అలయన్స్‌’ ఫౌండేషన్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించిన లియోనార్డో డికాప్రియో..

  • Publish Date - August 26, 2019 / 12:24 PM IST

అమెజాన్‌ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘ఎర్త్‌ అలయన్స్‌’ ఫౌండేషన్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్ల విరాళం ప్రకటించిన లియోనార్డో డికాప్రియో..

ఏడాది పొడవునా వర్షాలు కురిసే అమోజాన్ అడవుల్లో గతకొద్ది రోజులుగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. భూగ్రహం మీద లభించే 20 శాతం ఆక్సిజన్‌కు ఆధారమైన అమెజాన్‌ అడవుల్లో రేగిన కార్చిచ్చు వల్ల.. చెట్లు, అడవి జంతువులు కాలి బూడిదై పోతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇకనుండి ప్రతి ఒక్కరు బాధ్యతగా చెట్లు నాటాలని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెజాన్‌ అడవుల కోసం ప్రముఖ హాలీవుడ్‌ హీరో, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో తన వంతు విరాళం అందించేందుకు ముందుకొచ్చారు.

ఆయన ఈ ఏడాది జులైలో ‘ఎర్త్‌ అలయన్స్‌’ అనే పర్యావరణ ఫౌండేషన్‌ను స్థాపించారు. దీని ద్వారా 5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.36 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్లు లియోనార్డో ప్రకటించారు. అమెజాన్‌ అడవుల సంరక్షణ, అక్కడి ప్రజలు, వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు డికాప్రియో చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేస్తూ.. తమ వంతు సహాయం చేయాలంటూ తన ఫాలోవర్స్‌ను కోరారు. ‘మీరు విరాళంగా ఇచ్చిన ప్రతి రుపాయి అమెజాన్‌ సంరక్షణ కోసం ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని వివరాల కోసం alliance.org/amazonfund వెబ్‌సైట్‌’ చూడమని చెప్పారు.

Read Also : మిస్ ఇండియాగా కీర్తి సురేష్ – టైటిల్ టీజర్ రిలీజ్..

‘ప్రపంచంలోని ప్రాణులకు 20 శాతం ఆక్సిజన్‌ అందించే అటవీ ప్రాంతం ఇలా మంటల్లో చిక్కుకుపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భూమికి ఊపిరితిత్తులుగా ఉండే ఈ అమెజాన్‌ అడవులు గత 16 రోజులుగా మండిపోతున్నాయి. కానీ మీడియా దీని మీద ఎందుకు పెద్దగా దృష్టిసారించడం లేదు’.. అంటూ కొన్ని రోజుల క్రితం అమెజాన్‌ అడవుల పరిస్థతిపై లియోనార్డో ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు