LGBT Movie : ‘ఎల్‌‌జిబీటీ’ పార్ట్ 2 రెడీ చేస్తాను.. ఎల్‌‌జిబీటీ ఏ లీగల్ బ్యాటిల్ సక్సెస్ మీట్..

ట్రాన్స్‌జండర్స్ జీవితాల మీద కోర్ట్ రూమ్ డ్రామాగా “ఎల్‌జిబీటీ – ఏ లీగల్ బ్యాటిల్'' అనే సినిమా తీసి విజయం సాధించారు. (LGBT Movie)

  • Published on- July 21, 2026 / 10:06 PM IST

LGBT Movie

LGBT Movie : సామాజిక అంశాల సినిమాలను తీసే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి ఇటీవల శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై ట్రాన్స్‌జండర్స్ జీవితాల మీద కోర్ట్ రూమ్ డ్రామాగా “ఎల్‌జిబీటీ – ఏ లీగల్ బ్యాటిల్” అనే సినిమా తీసి విజయం సాధించారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ ఈ సినిమా యూనిట్ ని అభినందిస్తూ మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పి. సునీల్‌కుమార్‌, ఎల్‌.బి. శ్రీరామ్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో LB శ్రీరామ్‌ మాట్లాడుతూ.. సినిమాలో జడ్జి స్థానంలో చేశాను. ఇంత గొప్ప దర్శకుడ్ని ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు అనిపిస్తుంది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం ఒక చరిత్ర. న్యాయదేవతకి కళ్ళకి గంతలు కడతారు. కానీ ఈ సినిమాలో నాకు కళ్ళకు గంతలు కట్టారు. జడ్జి అనేవాడు కళ్ళు ఉండి చూడలేడు కాబట్టి వచ్చింది విని చెప్పాలి. ఈ సినిమా వల్ల ట్రాన్స్‌ జండర్స్‌ మీద సదప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఉందా వీరి కథ, వాళ్ళ ఆచారాలు ఇన్ని ఉన్నాయా అని నాకు ఈ సినిమా ద్వారా తెలిసింది అని అన్నారు. తెలంగాణ ట్రాన్స్‌ జండర్‌ ప్రెసిడెంట్‌ లైలా ఓరుగంటి మాట్లాడతూ.. నేను ఏమి చేయాలనుకున్నానో, సొసైటీలో మేము పడుతున్న ఇబ్బందులు, న్యాయ స్థాయనం మాకు ఇచ్చే తీర్పులు ఇవన్నిటినీ సినిమాలో చక్కగా చూపించారు. ఇబ్బందుల్లో ఉండే మాతోనే నటింపచేసి మాతోనే ఇబ్బందులను చెప్పించారు అని అన్నారు.

Also Read : Kiran Abbavaram : ఆ సినిమా వద్దు అని చెప్పాను.. సాయి ధరమ్ తేజ్ అన్న చేస్తున్నాడు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్..

నటుడు ఆనంద చక్రమాపాణి మాట్లాడతూ.. ఈ సినిమా ఫస్ట్‌డే షూట్‌లో 20మంది ట్రాన్స్‌జండర్స్‌ ఉన్నారు. నేను వీళ్ళతో యాక్ట్‌ చేయాలా అనుకున్నాను. ఒక ఐదారుగురితో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాక నాకు వాళ్ళపై ఉన్న అభిప్రాయం మారింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చాక చాలా మంది నన్ను చూసి ఎమోషన్‌ అయ్యారు. మా ఫాదర్‌ మీలా ఉంటే బావుండేది అని నన్ను చూసి ఫీలయ్యారు అని అన్నారు. నటుడు విష్ణు తేజ మాట్లాడతూ.. ఈ రోజు గర్వంగా ఉంది ఫిలిం క్రిటిక్స్‌ వాళ్ళు గౌరవం ఇవ్వడం. కొన్ని సినిమాలు చూస్తే మా గురించి తీసే సన్నివేశాలను దానికి సంబంధించిన దర్శకులు కనిపిస్తే వారిని మేం క్రిటిక్స్ అయి అడగాలనుకుంటాం. అలాంటిది ఈ రోజు మా సినిమాని ఫిలిం క్రిటిక్స్‌ వారు అభినందించడం ఆనందించాల్సిన విషయం అని అన్నారు.

ఈ సినిమా డైరెక్టర్ సునీల్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. చాలా యూనివర్సిటీల్లో ఈ సినిమా ప్రైవేట్‌ స్క్రీనింగ్‌ గురించి అడుగుతున్నారు. మంచి ఆదరణ వచ్చింది. ఎల్‌బి శ్రీరామ్‌ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో నాకు సపోర్ట్ చేసిన వారికి, ఆదరించిన వారికి ధన్యవాదాలు. 2027లో ఈ సినిమాకు సెకండ్‌ పార్ట్‌ చేస్తాను అని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఫిలిం క్రిటిక్స్‌ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ.. సినిమా గురించి తెలుసుకుని ఇలాంటి సినిమాని అభినందించాలి అనుకున్నాం. ఆత్మ నూనతకు, ఆత్మ గౌరవానికి మధ్య నలిగిపోతున్న జీవితమే ఈ కథ అని అన్నారు. ఫిలిం క్రిటిక్స్‌ సెక్రటరీ సురేష్‌ కొండేటి మాట్లాడుతూ.. ఎల్‌.జి.బి.టి. అనే టైటిల్‌ తెలుగు వాళ్ళకి అర్ధం కాదు కదా అనుకున్నాను కానీ ఇది తెలుగువారికి మాత్రమే కాదు పాన్‌ ఇండియా టైటిల్‌. ఈ సినిమాకి అవార్డులు రావాలి అని అన్నారు.