Kiran Abbavaram : ఆ సినిమా వద్దు అని చెప్పాను.. సాయి ధరమ్ తేజ్ అన్న చేస్తున్నాడు.. కిరణ్ అబ్బవరం కామెంట్స్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (Kiran Abbavaram)
Kiran Abbavaram
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం జులై 24న చెన్నై లవ్ స్టోరీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. కిరణ్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Vijay Deverakonda : ఈ సినిమా ఆగిపోయిందని తెలుసా? విజయ్ ప్రభాస్ కంటే ముందే ఆ హీరోయిన్ ని..
కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. సంబరాల ఏటిగట్టు సినిమా సాయి ధరమ్ తేజ్ అన్న చేస్తున్నాడు. ఆ సినిమా నేనే చేయాలి. ఆ సినిమా డైరెక్టర్ రోహిత్ 2021 లోనే నన్ను కలిసాడు. అతను చాలా ట్యాలెంటెడ్. ఓ రెండు కోట్లతో అయిపోయే చిన్న కథ తీసుకొచ్చాడు. నీ దగ్గర మంచి ట్యాలెంట్ ఉంది. మంచి పెద్ద కథ చెప్పు అన్నాను. మంచి కథ తీసుకొస్తే చేద్దాం అన్నాను. రోహిత్ ఈ సంబరాల ఏటిగట్టు కథ తీసుకొచ్చాడు. నాకు హనుమాన్ నిర్మాత నిరంజన్ అన్న క్లోజ్. ఆయనతో కలిసి చేద్దాం అనుకున్నాము. నేనే ఈ దర్శకుడిని పరిచయం చేశాను.
ఆ కథ ప్రీ ప్రొడక్షన్ అయ్యే ప్రాసెస్ లో నాకు వరుసగా వేరే సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఈ సినిమా బడ్జెట్ ఏమో పెరిగిపోయింది. దాదాపు 60 నుంచి 70 కోట్లకు వెళ్లిపోయింది. అప్పటికి నేను ఉన్న పొజిషన్ లో నా మీద అంత బడ్జెట్ కరెక్ట్ కాదు. నిర్మాతకు వద్దు అని చెప్పాను. కానీ నిరంజన్ అన్న చేద్దాం అన్నారు. నేనే నాకు అప్పటికి ఉన్న మార్కెట్ కి రిస్క్ అనే ఫీలింగ్ వచ్చి వద్దు అని చెప్పాను. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ అన్నతో చేస్తున్నాం అని చెప్పారు. నేను హ్యాపీ. డైరెక్టర్ కి వెళ్లి సాయి ధరమ్ తేజ్ తో చెయ్యి అని చెప్పాను. అది పెద్ద హిట్ అయితే నేనే సంతోషిస్తాను మొదట. ఎందుకంటే ఆ డైరెక్టర్ ట్యాలెంట్ నాకు తెలుసు అన్నారు.
ఇక సంబరాల ఏటిగట్టు సినిమాని సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య లక్ష్మి జంటగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ నిర్మాణంలో దాదాపు 120 కోట్లతో భారీగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
#SYG నేను చేయాల్సిన సినిమా…
బడ్జెట్ పెరిగింది…. అప్పుడు నాకున్న, మార్కెట్ కి అంత బడ్జెట్ వర్కౌట్ అవ్వదనుకున్నా.
ఇప్పుడు Saidharam Tej అన్న చేస్తున్నారు Happy
– @Kiran_Abbavaram pic.twitter.com/1AQIZRT2UP
— Rajesh Manne (@rajeshmanne1) July 21, 2026
