Liger: ‘లైగర్’ గ్లింప్స్ ఇదిగో..! ఇరగదీసిన పూరీ-రౌడీ!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి, చార్మీ, కరణ్ జొహార్ కలిసి పాన్ ఇండియా..
- Naresh Mannam
- Published On : December 31, 2021 / 01:09 PM IST
Liger
Liger: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి, చార్మీ, కరణ్ జొహార్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే తెలుగు తెరకి పరిచయమవుతోంది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!
లేడీస్ అండ్ జెంటిల్‌మేన్ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఎంఎంఏ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ముంబై వీధుల్లో పెరిగిన స్లమ్‌డాగ్, చాయ్ వాలా.. ది లైగర్’ అంటూ విజయ్ దేవరకొండను పరిచయం చేసే సన్నివేశాలతో ప్రారంభమైన గింప్స్‌లో ప్రతి సీన్ అదరగొట్టేలా సాగింది. ఇంకా చెప్పాలంటే పక్కా పూరి మార్క్ మేకింగ్ కి రౌడీ హీరో తోడైతే ఎలా ఉంటుందో అలాగే ఉంది గ్లింప్స్.
RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!
గతానికి భిన్నంగా ఏళ్ళు తడబడి పూరి జగన్నాధ్ చేస్తున్న సినిమా ఇది కాగా.. అందుకు తగ్గ అవుట్ ఫుట్ సినిమాలో కనిపిస్తుంది. దానికి ఉదాహరణే గ్లింప్స్. చాలాకాలంగా అడపాదడపా ఫోటోలతోనే కాలం గడిపేసిన లైగర్ నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురూచూస్తున్నారు. లేట్ గా వచ్చిన లేటెస్ట్ వస్తామంటూ ఇదిగో మా వర్క్ శాంపిల్ అంటూ క్రేజీ ట్రీట్ ఇచ్చేశారు పూర్ అండ్ కో. గ్లింప్స్ తర్వాత మొత్తంగా పూరి అదరగొట్టేశాడనే టాక్ వినిపిస్తుండగా.. యూట్యూబ్లో ఈ వీడియో దూసుకుపోతుంది.
