2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!

కొవిడ్ ఎఫెక్ట్ తో 2020 లాగానే 2021 కూడా నడిచింది బాలీవుడ్ లో. చాలామంది మేకర్స్ డిజిటల్ ఎంట్రీకి సై అంటే కొంతమంది మాత్రం పట్టుపట్టి థియేటర్స్ కే వాళ్ల సినిమాలను తీసుకొచ్చారు.

2021 Bollywood Films: బాలీవుడ్‌కి కలిసిరాని 2021.. వచ్చే ఏడాదిపైనే ఆశలన్నీ!

2021 Bollywood Films

2021 Bollywood Films: కొవిడ్ ఎఫెక్ట్ తో 2020 లాగానే 2021 కూడా నడిచింది బాలీవుడ్ లో. చాలామంది మేకర్స్ డిజిటల్ ఎంట్రీకి సై అంటే కొంతమంది మాత్రం పట్టుపట్టి థియేటర్స్ కే వాళ్ల సినిమాలను తీసుకొచ్చారు. ఇక కొందరు స్టార్స్ డీసెంట్ హిట్ కొడితే.. కొంతమంది ఫిల్మ్స్ పత్తా లేకుండా పోయాయి. అసలు 2021 బాలీవుడ్ కి ఇచ్చిన రిజల్ట్ ఏంటి..? 2022ను ఎలా స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

NTR-Allu Arjun: బన్నీ వద్దనుకున్నా.. తారక్ కావాలనుకున్నాడు!

బాలీవుడ్ పై కొవిడ్ 2021లో కూడా నెగెటివ్ ఎఫెక్ట్ చూపించింది. కొన్నింటికి కొవిడ్ దెబ్బ తగిలితే.. కంటెంట్ లేని సినిమాలను జనాలే తిప్పికొట్టారు. 2021 ఫస్ట్ క్వార్టర్ రిలీజెస్ తీసుకుంటే.. రూహీ, ముంబై సాగా, సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా ప్రాజెక్ట్స్ థియేటర్స్ కొచ్చాయి. వీటిలో జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ రూహీ.. జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీల ముంబై సాగా మాత్రమే పర్వాలేదనిపించాయి. రూహీ 23 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే.. ముంబై సాగాకి దక్కింది 16న్నర కోట్లు మాత్రమే.

NBK 107: ఈసారి బాలయ్యతో తలపడేది యాక్షన్ కింగేనా?

మహారాష్ట్రలో కర్ఫ్యూ కారణంగా మార్చి తర్వాత పెద్దగా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాలేదు. చెప్పాలంటే సెకండ్ క్వార్టర్ లో బిగ్ బాలీవుడ్ రిలీజ్ రాధే మాత్రమే. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన రాధే హైబ్రిడ్ పద్ధతిలో రిలీజైంది. వ్యూ పర్ పే విధానంలో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి సేమ్ టైమ్ కొన్ని హాళ్లలోకి రాధేను తీసుకొచ్చారు. కానీ డిజాస్టర్ టాక్ రావడంతో రాధేను సల్మాన్ ఫ్యాన్స్ కూడా చూడలేకపోయారు.

RRR: న్యూ ఇయర్ సందడి.. టెలికాస్ట్ కానున్న హిందీ ప్రమోషన్లు!

సెకండ్ వేవ్ తర్వాత నైట్ కర్ఫ్యూ, 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో కొన్ని థియేటర్స్ తెరుచుకున్న టైంలో అంటే 2021 థర్డ్ క్వార్టర్ లో కాస్త పెద్ద సినిమాలొచ్చాయి. బెల్ బాటమ్, తలైవి, చెహ్రే లాంటి సినిమాలు రిలీజయ్యాయి. కానీ అమితాబ్ – ఇమ్రాన్ హష్మీల చెహ్రేతో పాటూ కంగనా రనౌత్ తలైవి కూడా కలెక్షన్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ పర్వాలేదనిపించి ఓవరాల్ 30కోట్లకు పైగా కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

Sai Pallavi: సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సాయిపల్లవి

ఇక చెప్పుకోవాల్సింది 2021 ఫోర్త్ క్వార్టర్ గురించి. ఈ ఇయర్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు థియేటర్స్ కొచ్చిన ప్రాజెక్ట్స్ బాలీవుడ్ ని కాస్త గట్టెక్కించాయి. ముఖ్యంగా 2021లో 100 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక సినిమాగా రికార్డ్ సృష్టించింది సూర్యవంశీ. అక్షయ్ కుమార్ హీరోగా రణ్ వీర్ సింగ్, అజయ్ దేవగణ్ లు కీ రోల్స్ లో వచ్చిన సూర్యవంశీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 195 కోట్లకు పైగానే ఉంది. అయితే బాలీవుడ్ మేకర్స్ కి బూస్టప్ నిచ్చింది సూర్యవంశీనే.

Arjuna Phalguna: ఈ ఏడాది మూడవ సినిమాతో గ్రాండ్ సెండాఫ్ చెప్పిన శ్రీవిష్ణు!

ఆర్ ఎక్స్ 100 రీమేక్ తడప్ డీసెంట్ కలెక్షన్స్ తో పర్వాలేదనిపించింది. ఆయుష్మాన్ ఖురానా చండీఘర్ కరే ఆషిఖీ పరిస్థితీ సేమ్. సల్మాన్ తన బావను లీడ్ రోల్ లో తీసుకొచ్చిన అంతిమ్ – ది ఫైనల్ ట్రూత్ అనుకున్నంత ఆడలేదు కానీ 39 కోట్ల కలెక్షన్స్ ను సెట్ చేసింది. హిందీ డబ్బింగ్ వర్షన్ పుష్ప ఇప్పటికే 22కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి దూసుకుపోతుంది. ఇక రీసెంట్ గా రిలీజైన రణ్ వీర్ సింగ్ 83కి పాజిటివ్ రివ్యూస్ ఫుల్ గా దక్కినా.. థియేటర్స్ లో ఆట మాత్రం అంతంతగానే ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే ఫస్ట్ వీక్ పూర్తయ్యేవరకు 70కోట్ల మార్క్ అందుకుంటుందనే అంచనా ఉంది.

Telugu Pan India Films: టాలీవుడ్‌పై బాలీవుడ్ ఫోకస్.. తెలుగోడి సత్తా తెలిసిందా?

కారణమేదైనా 2021లో బాలీవుడ్ లో గుర్తుండిపోయే హిట్ రాలేదు. 2022లో మాత్రం ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, అటాక్, గంగుభాయ్ కతియావాడి, లాల్ సింగ్ చద్దా, టైగర్ 3, పఠాన్, విక్రమ్ వేదా రీమేక్, ఆదిపురుష్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు రాబోతున్నాయి. మరీ సినిమాలైనా ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసి థియేటర్స్ కి రప్పిస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మేకర్స్.