Telugu Pan India Films: టాలీవుడ్‌పై బాలీవుడ్ ఫోకస్.. తెలుగోడి సత్తా తెలిసిందా?

టాలీవుడ్ స్టామినా తెలిసిపోయింది బాలీవుడ్ పెద్దలకి. ఒక్కొక్కరుగా తెలుగు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ సినిమా అన్నట్టు తయారైంది.

Telugu Pan India Films: టాలీవుడ్‌పై బాలీవుడ్ ఫోకస్.. తెలుగోడి సత్తా తెలిసిందా?

Telugu Pan India Films

Telugu Pan India Films: టాలీవుడ్ స్టామినా తెలిసిపోయింది బాలీవుడ్ పెద్దలకి. ఒక్కొక్కరుగా తెలుగు సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇండియన్ సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ సినిమా అన్నట్టు తయారైంది. నిన్నమొన్నటి వరకు మెరిసిన బాలీవుడ్ ఒక్కసారిగా ఢీలా పడింది. కొవిడ్ దెబ్బే కాదు.. హిందీ పరిశ్రమకు తెలుగు దెబ్బ కాస్త గట్టిగానే తగిలిందని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆర్ నారాయణ మూర్తి చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ ఇండస్ట్రీ. తెలుగు సినిమాపై ఫుల్ ఫోకస్ చేసింది బాలీవుడ్. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ సినిమానే అనేస్తోంది. ఇక్కడి హీరోలు కావాలని అక్కడి దర్శకులు అంటుంటే.. ఇక్కడి దర్శకులపై అక్కడి హీరోలు మనసు పారేసుకుంటున్నారు.

2021 Tollywood Heroins: తొలి సినిమాతోనే అదుర్స్ అనిపించుకున్న హీరోయిన్స్!

ఇక ప్రొడ్యూసర్స్ సంగతి అలాగే ఉంది. నిజానికి నిన్నమొన్నటి వరకు ఇండియన్ సినిమాలో మేజర్ క్రేజ్ బాలీవుడ్ దే. ఇండియన్ సినిమా హిస్టరీలో మేజర్ షేర్ బాలీవుడ్ దే. కానీ లెక్క మారిందిప్పుడు. పాన్ ఇండియా వైడ్ తెలుగు సినిమా సత్తా చూసి షాక్ అవుతున్నాయి అన్ని ఇండస్ట్రీలు. తెలుగు సినిమాని డైరెక్ట్ గానే ప్రమోట్ చేస్తున్నారు బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. ఫస్ట్ డే ట్రిపుల్ ఆర్ రికార్డ్ కలెక్షన్స్ కొట్టేస్తుందని జోస్యం చెప్పేశాడు. దేశవ్యాప్తంగా తొలి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉందని చెప్పుకొచ్చాడు. ఏకంగా తారక్, చరణ్ లను తెలుగు గాడ్స్, డెమీ గాడ్స్ అని పొగిడేశాడు. రాజమౌళి బ్రాండ్ వ్యాల్యూ గురించి.. జక్కన్న సినిమా స్టామినా గురించి తెగ మాట్లాడుతున్నాడు కరణ్ జోహార్. టాలీవుడ్ మూవీ సత్తా తెలిసింది కాబట్టే విజయ్ దేవరకొండ లైగర్ కు తానే ప్రొడ్యూసర్ అయ్యాడు కరణ్ జోహార్. ఫ్యూచర్ అర్థమైపోయిన కరణ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ ను డెమీ గాడ్స్ అనేస్తున్నాడనే చర్చ జరుగుతుంది.

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

పుష్ప గురించి ఓపెనయ్యాడు కరణ్ జోహార్. ఫస్ట్ డే హిందీలో 3 కోట్లు సాధించిన పుష్ప సినిమా పెద్దగా ప్రమోషన్స్ చేసుకోకపోయినా బాలీవుడ్ హిట్ గా నిలిచిందన్నాడు. హిందీ సినిమాలు సైతం ఈ రేంజ్లో ఓపెనింగ్స్ తెచ్చుకోవడం లేదు.. ఓ పోస్టర్ వదిలి, డిజిటల్ ప్రమోషన్స్కి పరిమితమైన పుష్పను చూడ్డానికి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. బన్నీ డబ్బింగ్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందంటూ అల్లు అర్జున్ స్టార్ డంను డైరెక్ట్ గానే ఒప్పేసుకున్నాడు కరణ్ జోహార్.

Movie Budgets Hike: తడిసిమోపెడవుతున్న బడ్జెట్.. హీరోల రెమ్యునరేషనే కారణం!

తన ఆఫీస్ కి ఎంతోమంది స్టార్స్ వస్తుంటారు పోతుంటారని.. ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం ఆఫీస్ ఫ్యాన్స్ హడావుడీతో అదిరిపోయిందని చెప్పాడు కరణ్ జోహార్. అలాగే ప్రభాస్ తో ఆదిపురుష్ చేస్తోన్న ఓంరౌత్ సైతం టాలీవుడ్ పై మనసు పారేసుకున్నాడు. తెలుగు స్టార్ తో సినిమా చేస్తే ఎక్కువమందికి కంటెంట్ చేరువవుతుంటే ఏ మేకర్ కైనా ఆనందమే అంటూ చెప్పుకొచ్చాడు. టాలీవుడ్ లో ఇది ఆరంభం మాత్రమే. ఇకపై తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు ఓం రౌత్.

Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

నిజానికి 83 లాంటి సినిమా బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజైంది. కానీ దానిని అక్కడ పట్టంచుకునే వాళ్లు తక్కువయ్యారు. బాలీవుడ్ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ సైతం తెలుగు సినిమాను ఆకాశానికెత్తినట్టు.. హిందీ సినిమాను పట్టించుకోవట్లేదు. స్పెషల్లీ జనవరి 7న రిలీజ్ కాబోతున్న ట్రిపుల్ఆర్, 14న వచ్చేస్తోన్న రాధేశ్యామ్ ఎఫెక్ట్ బాలీవుడ్ పై విపరీతంగా ఉండబోతోందని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. కంప్లీట్ గా మెట్రో సెంట్రిక్ సినిమాలు చెయ్యడంలో బిజీగా ఉన్న బాలీవుడ్.. రూరల్, అర్బన్ ని పెద్దగా కన్ సిడర్ చెయ్యడం లేదు. దాంతో హిందీలో డబ్ అవుతున్న తెలుగు సినిమాలు బాలీవుడ్ ని దెబ్బతీయబోతున్నాయనే చర్చలు బాలీవుడ్ లో నడుస్తున్నాయి.

Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

బాహుబలితో బాలీవుడ్ రికార్డుల్ని బద్దలుకొట్టిన తెలుగు సినిమా అప్పటి నుంచి వస్తున్న ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. బాహుబలి తర్వాత బాగా ఇంపాక్ట్ చూపించిన కెజిఎఫ్ తో పాటు లేటెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ పుష్ప కూడా బాలీవుడ్ తో టాప్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ లెక్కలు చూస్తుంటే బాలీవుడ్ స్టార్స్ కు దిమ్మతిరిగిపోతుంది. ఇది ఏ రేంజ్ లో ఉందంటే.. సాక్షాత్తూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన 4 నెలల వరకూ ఏ సినిమాని రిలీజ్ చెయ్యద్దని మిగతా వారికి వార్నింగ్ ఇచ్చేంతలా.

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

ఒక్క నార్త్ అనే కాదు తెలుగు స్టార్స్ సినిమాలిప్పుడు సౌత్ లోనూ హాట్ కేకులే. పుష్ప సౌత్ ఇండస్ట్రీల్లోనూ మంచి కెలక్షన్స్ రాబట్టింది. నానికి సౌత్ లో ఉన్న మార్కెట్ ని శ్యామ్ సింగ రాయ్ ఎలివేట్ చేస్తోంది. ఇక ఇండియా వైడ్ చూసుకుంటే 2021లో సక్సెస్ రేట్ మాక్సిమమ్ ఉన్న ఒకే ఒక ఇండస్ట్రీ టాలీవుడ్. ఇక్కడే ఈ ఇయర్ ఎక్కువ 100 కోట్ల సినిమాలొచ్చాయి. సో అందుకే ఇంతలా టాలీవుడ్ వెనకపడుతున్నారు.. టాలీవుడ్ స్టార్స్ ను వెనకేసుకొస్తున్నారు నార్త్ మేకర్స్.