Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

పాపం నానీ ఏ ముహూర్తాన తానేది మాట్లాడినా వివాదం అవుతుందని అన్నాడో కానీ నిజంగానే ఆయన మాట్లాడిన మాటలు వివాదమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం.. టికెట్ల ధరల వ్యవహారంపై శ్యామ్ సింగరాయ్..

Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

Nani Thaman

Nani-Thaman: పాపం నానీ ఏ ముహూర్తాన తానేది మాట్లాడినా వివాదం అవుతుందని అన్నాడో కానీ నిజంగానే ఆయన మాట్లాడిన మాటలు వివాదమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం.. టికెట్ల ధరల వ్యవహారంపై శ్యామ్ సింగరాయ్ వేడుకలో మాట్లాడిన నానీకి ఏపీ వైసీపీ నేతల నుండి భారీ కౌంటర్లు వచ్చాయి. కౌంటర్లు మాత్రమే కాదు.. సినిమాకి కూడా ఆ వ్యాఖ్యలే ఇబ్బంది పెట్టాయని కూడా ప్రచారం జరిగింది. ఏపీలో కొందరు బయ్యర్లు నానీ కామెంట్స్ తర్వాత వెనక్కు తగ్గడంతో నిర్మాతే అక్కడ సొంతంగా విడుదల చేశాడని కూడా ప్రచారం జరిగింది.

Richa Panai: ఫిదా చేసేస్తున్న రిచా పాలరాతి అందాలు..!

ఈ వ్యవహారం మొత్తం మీద నానీ ఐదు కోట్ల పారితోషకాన్ని కూడా వెనక్కు ఇచ్చేశాడని ప్రచారం జరిగింది. ఇది ఎంతవరకు నిజమన్నది పక్కన పెడితే సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆ విషయాన్ని పక్కనపెడితే నానీ ఈ మధ్య అదే సినిమా వేడుకలులో మాట్లాడిన మాటలు కూడా మరో వివాదంగా మారినట్లు కనిపిస్తుంది. తన సినిమాలో అన్ని క్రాఫ్ట్స్‌ లాగానే మ్యూజిక్‌కి సమానంగా ప్రాధాన్యత ఉంటుందని.. సంగీతం, బీజీఎం సినిమాను ఎలివేట్‌ చేయాలే తప్ప.. డామినేట్‌ చేయకూడదని.. లేదంటే శృతి తప్పుతుంది’ అని నానీ కామెంట్ చేశాడు.

Disha Patani: హృదయాలను కొల్లగొడుతున్న ‘లోఫర్’ భామ!

కట్ చేస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వరస ట్వీట్స్ ఆసక్తిగా మారాయి. ‘అన్ని క్రాఫ్ట్‌లు కలిసి పనిచేస్తేనే సినిమా విజయవంతం అవుతుందని, ఏ ఒక్క క్రాఫ్ట్‌ దేనిని నామినేట్‌ చేయదని వరుస ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు నాని కామెంట్స్ కు కౌంటర్ ట్వీట్స్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అఖండ సినిమాకు తమన్ సంగీతం.. ముఖ్యంగా బీజీఎం హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఒకదశలో సినిమాను డామినేట్ చేసేలా తమన్ వీరబాదుడు కొట్టాడని కూడా టాక్ వచ్చింది. దీంతో నానీ ఆ వ్యాఖ్యలు చేశాడని అనుకున్నారు.