2021 Tollywood Heroins: తొలి సినిమాతోనే అదుర్స్ అనిపించుకున్న హీరోయిన్స్!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరైనా కొంతకాలమే రాజ్యమేలుతారు. ఇక్కడ పాత నీరు పోవాల్సిందే.. కొత్త నీరు రావాల్సిందే. అలాగే 2021లో ఫ్యూచర్ టాప్ అనిపించుకునేందుకు క్రేజీ సినిమాలతో..

2021 Tollywood Heroins: తొలి సినిమాతోనే అదుర్స్ అనిపించుకున్న హీరోయిన్స్!

2021 Tollywood Heroins

2021 Tollywood Heroins: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎవరైనా కొంతకాలమే రాజ్యమేలుతారు. ఇక్కడ పాత నీరు పోవాల్సిందే.. కొత్త నీరు రావాల్సిందే. అలాగే 2021లో ఫ్యూచర్ టాప్ అనిపించుకునేందుకు క్రేజీ సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చారు ముద్దుగుమ్మలు. వీళ్లలొ కొందరైతే ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే.. మేకర్స్ దృష్టిలో పడి ఈ ఇయర్ గ్లామర్ క్వీన్స్ అవతారమెత్తారు. 2021.. టాలీవుడ్ కి టాలెంటెడ్ ప్లస్ గ్లామర్ క్వీన్స్ ను పరిచయం చేసింది. ఫ్యూచర్ లో ఫుల్ స్కోప్ ఉన్న అందగత్తెలకు పట్టంగట్టింది. వీళ్లలో ముగ్గురు ముద్దుగుమ్మలైతే ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే ఈ ఏడాది జనం దృష్టిలో పడ్డారు. బడా ఆఫర్స్ ను బ్యాగ్ లో వేసుకున్నారు.

Salman Khan: భాయ్‌జాన్ బిజీబిజీ.. ఒకవైపు సోలో సినిమాలు మరోవైపు మల్టీస్టారర్‌లు!

ఫస్ట్ పేరు చెప్పాల్సి వస్తే వీళ్లలో కృతిశెట్టే ముందుంటుంది. వైష్ణవ్తేజ్- బుచ్చిబాబు కాంబో ఉప్పెనతో ప్రేక్షకుల్ని ఫిదా చేసింది కృతి శెట్టి. 2020 లాక్డౌన్టైంలోనే పాటలు ట్రెండవడంతో బేబమ్మని చాలామంది ఇష్టపడ్డారు. ఉప్పెన విడుదలయ్యాక కన్నడ బ్యూటీ లుక్స్ ప్లస్ యాక్షన్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ఆఫర్స్ అంతే రేంజ్ లో వచ్చాయి. ఉప్పెన రిలీజ్ కి ముందే నాని ‘శ్యామ్ సింగ రాయ్’కి సైన్ చేసిన కృతి ఆ సినిమాతో కూడా ఈ ఇయర్ థియేటర్స్ కొచ్చేసింది. రీసెంట్ గా అక్కినేని హీరోల బంగార్రాజు షూటింగ్ కూడా పూర్తి చేసేసింది. ప్రస్తుతం సుధీర్ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్-లింగుస్వామి కాంబో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

Movie Budgets Hike: తడిసిమోపెడవుతున్న బడ్జెట్.. హీరోల రెమ్యునరేషనే కారణం!

రొమాంటిక్ రిలీజ్ కి ముందే రొమాంటిక్ సీన్ లో కనిపించి హాట్ ట్రెండ్ అయింది కేతికాశర్మ. సినిమా రిలీజయ్యాక 2021 మోస్ట్ గ్లామరస్ గర్ల్ గా పేరుతెచ్చుకుంది. రొమాంటిక్ విడుదలకు ముందే నాగశౌర్య లక్ష్యలో ఛాన్స్ అందుకొని ఆ సినిమాతో కూడా ఈమధ్యే ఆడియెన్స్ కు హాయ్ చెప్పింది. మరోవైపు వైష్ణవ్ తేజ్ కి జోడీగా సెట్టయింది. తమిళ్ డైరెక్టర్ గిరీశయ్య వైష్ణవ్ తేజ్ కాంబోలో కూడా కేతికనే హీరోయిన్. మరికొన్ని ఆఫర్స్ కూడా కేతిక కోసం వెయిట్ చేస్తున్నాయి.

Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఫస్ట్ మూవీతోనే ఎక్కువ మార్కులు కొట్టేసింది ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు’తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ బ్యూటీ ఓ సెన్సేషన్ అయింది. రత్నాల్లో ‘చిట్టి’గా మెరిసి.. ప్రేక్షకుల్ని మెప్పించి.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’లో గెస్ట్ గా కనిపించింది. నాగార్జున, నాగచైతన్య ‘బంగార్రాజు’లో చేసిన స్పెషల్ సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇక శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబో ఢీ సీక్వెల్ లో ఛాన్స్ దక్కించుకుంది.

Sukumar-Vijay Devarakonda: రౌడీతో సుక్కూ సినిమా ఉంటుందా.. మరి ఆ ఊసేలేదేంటి?

తెలుగు సిల్వర్ స్క్రీన్ పై 2021లో మెరిసిన మరో కన్నడ సోయగం శ్రీలీల. పెళ్లిసందడితో బంపర్ గ్లామర్ ఎంట్రీ ఇచ్చింది. నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా.. పెళ్లిసందడి బ్లాస్టర్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఓ కారణం శ్రీలీలే. కన్నడలో ఆల్రెడీ హాట్ అనిపించుకున్న శ్రీలీల ఫోకస్ చేసింది మాత్రం టాలీవుడ్ మీదే. ఇప్పటికే రవితేజ – త్రినాథరావ్ నక్కిన కాంబో మూవీ ధమాకాలో ఛాన్స్ కొట్టేసింది. ఓ మెగా హీరో సినిమాకు కూడా సైన్ చేసిందని సమాచారం. ఇవే కాకుండా శ్రీలీల మరో నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టినట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Bigg Boss Telugu OTT: ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీళ్ళేనా..?

టాలీవుడ్ హీరోయిన్స్ విషయంలో ఇంపోర్ట్ బిజినెస్ ఎప్పుడూ హైప్ మీదే ఉంటుంది. 2021లోనూ అదే జరిగింది. పాన్ ఇండియా లెవెల్ కోసం ఆల్రెడీ బాలీవుడ్ క్వీన్స్ క్యూకడుతున్నారు. వారితో పాటే మేమున్నామంటున్నారు కన్నడ, మలయాళీ హీరోయిన్స్ తెలుగులో ఎంట్రీ ఇచ్చేశారు. రామ్ రెడ్ సినిమాతో నేరుగా 2021లో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చిన కన్నడ బ్యూటీ అమృత అయ్యర్. తర్వాత 30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమాతో అమ్మాయిగారు అనిపించుకుంది. అతిత్వరలో థియేటర్స్ కి రాబోతున్న శ్రీవిష్ణు అర్జున ఫాల్గుణలోనూ అమృతనే హీరోయిన్. ఇక తేజ సజ్జ హీరోగా తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ హనుమాన్ లోనూ లేడీ లీడ్ అమృత అయ్యర్ అని చెప్పేసాడు ప్రశాంత్ వర్మ.

బాప్‌రే.. సల్మాన్ బర్త్‌డేకు కోట్ల రూపాయల బహుమతులు!

నార్త్ గర్ల్ మీనాక్షి చౌదరి… ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్ గా 2021లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ తర్వాత ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. అయితే ఈ మూవీ విడుదలకు ముందే కన్ఫర్మ్ చేసుకున్న రవితేజ ‘ఖిలాడి’లో ఆడిపాడుతోంది మీనాక్షి. అంతేకాదు నాని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హిట్2’లోనూ మీనాక్షినే హీరోయిన్. అన్నింటికి మించి అన్నట్టు ప్రభాస్, మహేశ్ బాబు ప్రాజెక్ట్స్ లో కూడా మీనాక్షి పేరు వినిపిస్తోంది. సలార్, సర్కారు వారి పాట సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షిని సంప్రదించినట్టు తెలుస్తోంది.

Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!

కన్ను కొట్టి వైరల్ గా మారిన మలయాళీ భామ ప్రియాప్రకాశ్వారియర్. నితిన్ ‘చెక్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తేజా సజ్జా ‘ఇష్క్’తో మరోసారి కనిపించింది. కానీ కన్ను గీటినంత తేలిగ్గా హిట్ కొట్టలేకపోయింది. కార్తికేయ హీరోగా వచ్చి ‘రాజా విక్రమార్క’తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది తమిల్ హీరోయిన్ తాన్యా రవిచంద్రన్. నరేశ్ నాంది సినిమాతో నవమి.. కనబడుట లేదు మూవీతో వైశాలి రాజ్.. రాజ్ తరుణ్ అనుభవించు రాజాతో కశిష్ ఖాన్, పుష్పక విమానంతో గీత్ షైని, గాలి సంపత్ తో లవ్లీ సింగ్ లాంటి అందాల భామలు తెలుగు ఇండస్ట్రీలోకి 2021లో ఎంట్రీ ఇచ్చారు.

Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

ఈ ఏడాది డైరెక్ట్ ఓటీటీ ఎంట్రీలోనే ఇంట్రడ్యూస్ అయిన హీరోయిన్స్ ఉన్నారు. రాజశేఖర్ కూతురు శివానీ అద్భుతం అనే సినిమాతో హాట్ స్టార్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ఆమె రీసెంట్ మూవీ డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ కూడా సోనీ లివ్ లోనే రిలీజైంది. వివాహ భోజనంబుతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి నటనతో మెప్పించింది ఆర్జవీ రాజ్. ఆహాలో రిలీజైన అర్థ శతాబ్ధం సినిమాతో ఆకట్టుకుంది కృష్ణప్రియ.