Liger Locks OTT Partner: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైగర్’ అత్యంత భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కించగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రావడంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు రిలీజ్ అవుతున్న ఈ చిత్రం థియేటర్లలో తుక్కు రేగ్గొట్టేందుకు రెడీ అయ్యింది. అయితే థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను చూసేందుకు రెడీ అవుతున్న ప్రేక్షకులు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పేశాడు లైగర్.
ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్‌గా తన సత్తా చాటడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.
Liger Movie : లైగర్‌లో మైక్ టైసన్‌తో విజయ్ దేవరకొండకి ఫైట్ ఉందా.. పూరి జగన్నాధ్ ఏం చెప్పాడంటే..?
విజయ్ దేవరకొండ ఫైటర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోండగా, రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా అని అందరి చూపులు ఈ మూవీపైనే ఉన్నాయి.