Liger Pre Release Business : లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 100 కోట్లు రావాల్సిందే.. విజయ్ కెరీర్లోనే హైయ్యెస్ట్..
లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్ లోనే అత్యధికంగా జరిగింది. ఏకంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లైగర్ సినిమాకి జరగడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. వరల్డ్ వైడ్ లైగర్ సినిమా ప్రై రిలీజ్ బిజినెస్ వివరాలు............
- Saketh U
- Published On : August 24, 2022 / 01:32 PM IST
Liger Pre Release Event Business Details
Liger Pre Release Business : విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇండియా అంతా తిరిగేస్తున్నారు. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుందని అంచనా వేస్తున్నారు సినీ వర్గాలు. లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ విజయ్ కెరీర్ లోనే అత్యధికంగా జరిగింది. ఏకంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లైగర్ సినిమాకి జరగడంతో సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
వరల్డ్ వైడ్ లైగర్ సినిమా ప్రై రిలీజ్ బిజినెస్ వివరాలు :
నైజాం : 25 కోట్లు
సీడెడ్ : 9 కోట్లు
ఉత్తరాంధ్ర : 7.5 కోట్లు
ఈస్ట్ : 5 కోట్లు
వెస్ట్ : 3.8 కోట్లు
గుంటూరు : 5.2 కోట్లు
కృష్ణా : 4.3 కోట్లు
నెల్లూరు : 2.2 కోట్లు
టోటల్ ఆంద్ర తెలంగాణలో లైగర్ సినిమా 62 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటక : 5.20 కోట్లు
తమిళనాడు : 2.5 కోట్లు
కేరళ : 1.20 కోట్లు
నార్త్ ఇండియా : 10 కోట్లు
ఓవర్సీస్ : 7.5 కోట్లు
Director Shankar : భారతీయుడు 2 షూటింగ్ మొదలు.. మరి చరణ్ సినిమా పరిస్థితి ఏంటి?
టోటల్ ప్రపంచ వ్యాప్తంగా లైగర్ సినిమా 88.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 90 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అంటే దాదాపు 100 కోట్లు రాబట్టాల్సిందే. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ మీద నమ్మకంతోనే ఈ రేంజ్ లో లైగర్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఏ రేంజ్ లో ఈ సినిమాకి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.
