Director Shankar : భారతీయుడు 2 షూటింగ్ మొదలు.. మరి చరణ్ సినిమా పరిస్థితి ఏంటి?

భారతీయుడు 2 సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. తాజాగా నేడు భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం............

Director Shankar : భారతీయుడు 2 షూటింగ్ మొదలు.. మరి చరణ్ సినిమా పరిస్థితి ఏంటి?

indian 2 movie opening

Updated On : August 24, 2022 / 12:42 PM IST

Director Shankar :  డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా తెరకెక్కిస్తున్నారు. చరణ్ 15వ సినిమాగా, దిల్ రాజు 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది ఈ సినిమా. వచ్చే సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం కమల్‌ హాసన్ – శంకర్‌ల కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు 2 సినిమాని మళ్ళీ మొదలుపెట్టడమే.

భారతీయుడు 2 సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్, నిర్మాతలతో గొడవలు, పలు కారణాలతో సినిమా ఆగిపోయింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ మొదలైంది. తాజాగా నేడు భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం మరోసారి జరిగింది. భారతీయుడు 2 సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో కమల్ హాసన్ పాల్గొనకపోవడం విశేషం. సెప్టెంబర్ 2 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు సమాచారం.

Sandeep Vangaa : బాలీవుడ్ డైరెక్టర్ కోసం టాలీవుడ్ డైరెక్టర్ ని పక్కన పెట్టేయనున్న ప్రభాస్..?

ఇండియన్ 2 సినిమా మొదలవుతుందని తెలియడంతో ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. RC15 సినిమా ఇంకా షూట్ లోనే ఉంది. ఇప్పుడేమో సెప్టెంబర్ నుంచి భారతీయుడు 2 షూటింగ్ అంటున్నారు. కమల్ హాసన్ కోసం శంకర్ చరణ్ సినిమాని హోల్డ్ లో పెట్టనున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చరణ్ అభిమానులు. లేదా RC15 షూటింగ్ అయిపోయిందా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందేనేమో.