Top 10 Movies : ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టిన టాప్ 10 ఇండియన్ సినిమాలు.. అందులో సగం ప్రభాస్ వే..

ఇండియన్ సినిమాలు ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.

List of top 10 worldwide day 1 collections in Indian cinema

Top 10 Movies : ఇండియన్ సినిమాలు ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసాయి. ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇక ఆ సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన టాప్ 10 సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ టాప్ 10 సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఉంది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజే 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అప్పటి వరకు మొదటి స్థానాల్లో ఉన్న సినిమాలను వెనక్కి నెట్టింది.

ఈ సినిమా తర్వాత 223 కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో రాజమౌళి దర్శకత్వలో వచ్చిన RRR సినిమా ఉంది. పుష్ప 2 సినిమా కంటే ముందు ఈ సినిమానే మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఈ చిత్రం వచ్చింది. మూడో స్థానంలో 210కోట్లు వసూలు రాబట్టి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా ఉంది. నాలుగో స్థానంలో ప్రభాస్ హీరోగా చేసిన కల్కి సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజే 191 కోట్లు రాబట్టింది. ఐదో స్థానంలో సలార్. ప్రభాస్ నటించిన ఈ మూవీ 178 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read : పుష్ప హిందీ డబ్బింగ్ కోసం నోట్లో కాటన్ పెట్టుకొని మరీ.. బాలీవుడ్ నటుడు కామెంట్స్..

ఇక ఆరో స్థానంలో ఇటీవల వచ్చిన ఎన్టీఆర్ దేవర సినిమా ఉంది. ఈ మూవీ 172 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత ఏడవ స్థానంలో యష్ హీరోగా నటించిన KGF సినిమా 160కోట్ల కలెక్షన్ అందుకుంది. ఎనిమిదవ స్థానంలో విజయ్ నటించిన లియో సినిమా 148 కోట్ల వసూలు చేసింది. అనంతరం తొమ్మిదవ స్థానంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా 140కోట్లు వసూలు చేసింది. ఆఖరి 10వ స్థానంలో కూడా ప్రభాస్ నటించిన సాహూ సినిమా ఉంది. ఈ సినిమా 130 కోట్ల కలెక్షన్ రాబట్టింది.

అన్ని సినిమాల రికార్డు తిరగరాసిన అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కేవలం విడుదలైన రెండు రోజులకే 500 కోట్ల క్లబ్ లోకి చేరింది. మొదటిరోజే 294 కోట్ల వసూళ్లు రాబట్టి మొదటి స్థానంలోకి చేరింది. దీంతో అటు మూవీ టీమ్ తో పాటు సినీ ఆడియన్స్ సైతం ఖుషీగా ఉన్నారు.