Lokesh Kanagaraj : ప్రభాస్ సినిమాతో లోకేష్ కనగరాజ్ ఎండ్ గేమ్.. ఐరన్ మ్యాన్‌లా..
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ 'ఎండ్ గేమ్' చిత్రం కాబోతుందట. ప్రభాస్ ఐరన్ మ్యాన్‌లా..
- gum 95921
- Updated on- October 8, 2023 / 12:00 PM IST
Lokesh Kanagaraj last movie with prabhas update and story line
Lokesh Kanagaraj : కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. విజయ్ ‘లియో’ సినిమాతో ఈ దసరాకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న లోకేష్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ అండ్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. లోకేష్ తన కెరీర్ లో పది సినిమాలు మాత్రమే చేస్తాను అంటూ గతంలో వెల్లడించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు లియో మూవీ.. లోకేష్ కెరీర్ లో ఐదో సినిమాగా వస్తుంది.
Also read : Tejas Trailer : కంగనా రనౌత్ ‘తేజస్’ ట్రైలర్ రిలీజ్.. ఫైటర్ జెట్ పైలెట్‌గా కంగనా యాక్షన్ సీన్స్..
ఇక ఈ మూవీ తరువాత లోకేష్ లైనప్ ఏంటని అడగగా, దర్శకుడు బదులిస్తూ.. రజినీకాంత్‌తో Thalaivar 171, కార్తితో ఖైదీ-2, కమల్‌తో విక్రమ్-2, సూర్యతో రోలెక్స్, ప్రభాస్‌తో చివరి సినిమా అని తెలియజేశాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ ‘ఎండ్ గేమ్’ చిత్రం కాబోతుందని తెలుస్తుంది. గతంలో లోకేష్ ఒక ఫంక్షన్ లో తన డ్రీం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్‌తో ఆ సినిమా తెరకెక్కిస్తానని చెబుతూ ఆ మూవీ స్టోరీ లైన్ కూడా రివీల్ చేశాడు.
‘ఒక యాక్సిడెంట్ లో చెయ్యి పోగుట్టుకున్న హీరో.. ఐరన్ హ్యాండ్ అమర్చుకొని క్రైమ్స్ సిండికెట్ లో ఏం చేశాడనేది’ సినిమా కథ అని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ వీడియోని ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ప్రభాస్, లోకి మూవీ LCU లో ఎండ్ గేమ్ అవుతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఆ మూవీ పై ఇప్పుడే భారీ హైప్ నెలకుంది. కాగా లోకేష్, రజినితో తెరకెక్కించే Thalaivar 171ని వచ్చే ఏడాది సమ్మర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడట. లియో రిలీజ్ అయిన తరువాత ఆ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానని తెలియజేశాడు.
