Lokesh Kanagaraj starter DC Movie title Glimpse Release
DC Title Glimpse: తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు హీరోగా మారాడు. ఆయన హీరోగా వస్తున్న ఫస్ట్ మూవీ DC. ధనుష్ తో కెప్టెన్ మిల్లర్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన అరుణ్ మాతేశ్వరన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన టైటిల్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. హీరోగా ఫస్ట్ మూవీలోనే అదరగొట్టేశాడు లోకేష్. టీజర్ మీరు కూడా చూసేయండి.
Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..