Pushpa 2 : పుష్ప 2 యాక్షన్ సీన్ లీక్.. నదిలో లారీ ఛేజ్ వీడియో.. వీడియో వైరల్!

పుష్ప 2 షూటింగ్ సెట్స్ నుంచి యాక్షన్ సన్నివేశం లీక్. నదిలో లారీలో చేసి సీన్ చిత్రీకరిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Pushpa 2 : పుష్ప 2 యాక్షన్ సీన్ లీక్.. నదిలో లారీ ఛేజ్ వీడియో.. వీడియో వైరల్!

Lorry Action Sequence leaked from Allu Arjun Pushpa 2 shooting sets

Updated On : June 16, 2023 / 12:31 PM IST

Allu Arjun Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన మూడో సినిమా పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ , డైలాగ్స్ అండ్ డాన్స్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. దీంతో మూవీకి వరల్డ్ వైడ్ పాపులారిటీ లభించింది. దీంతో ఈ మూవీ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Arjun Leela : ఆహాలో అల్లు అర్జున్, శ్రీలీల సందడి ఏంటో తెలిసిపోయింది.. సిరీస్, మూవీ..

ఇక ఆ అంచనాలను అందుకునేలా మూవీ టీం సెకండ్ పార్ట్ ని మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్ కూడా లేటు అవుతూ వస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అండ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుంచి ఒక వీడియో లీక్ అయ్యింది. ఆ వీడియోలో ఎర్రచందనం లోడ్ తో ఉన్న నాలుగు లారీలు నదిలో వెళ్తుంటే, వాటిని ఛేజ్ చేస్తూ రెండు జీపులు వెనకాలే వస్తున్నాయి. ఈ సీన్ అవుట్ డోర్ చిత్రీకరణ కావడంతో కొందరు అభిమానులు ఆ విజువల్స్ ని ఫోన్ లో షూట్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ram Charan – Upasana : బిడ్డ పుట్టాక పూర్తి బాధ్యత చిరంజీవిదే అంటున్న ఉపాసన.. అత్తమామల దగ్గరకు షిఫ్ట్‌!

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపిస్తే.. సెకండ్ పార్ట్ లో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. అలాగే జగపతిబాబు ఈ పార్ట్ లో ఒక బలమైన పాత్రతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.