Unstoppable 4 : అన్‌స్టాపబుల్ లో బాలయ్యతో కలిసి తొడకొట్టిన స్టార్ హీరో..

Lucky Bask‌har movie team attend to balayya Unstoppable season 4

Unstoppable 4 : ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్ స్టాపబుల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొదటి ఎపిసోడ్ కూడా వచ్చింది. మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాబు చాలా విషయాలను వెల్లడించారు.

Also Read : Kiran Abbavaram : మా ఆవిడ ఒప్పుకుంటే అలాంటి సినిమా చేస్తా.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా ఇప్పుడు రెండో ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ మూవీ టీమ్ వచ్చారు. తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి వచ్చారు. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, నాగ వంశీ ఈ షోకి గెస్ట్ లుగా వచ్చారు. ఇప్పటికే ఎపిసోడ్ 2 కి సంబందించిన షూటింగ్ సైతం పూర్తయింది. ఆహా వేదికగా రెండవ ఎపిసోడ్ కి సంబందించిన పలు ఫోటోలని షేర్ చేశారు టీమ్. అందులో దుల్కర్, బాలయ్య ఇద్దరూ తొడ కొడుతూ ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. అలాగే బొమ్మ కార్ లో తన తండ్రి మమ్ముట్టి ఫోటో పక్కన దుల్కర్ సల్మాన్ కుర్చునట్టు ఓ ఫోటో ఉంది.


ఈ శుక్రవారం లక్కీ భాస్కర్ టీమ్ కి సంబందించిన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ 2 స్ట్రీమింగ్ చెయ్యనున్నారు. మరి ఈ ఎపిపోడ్ లో టీమ్ ఏ విషయాలు షేర్ చేసుకున్నారు, ఏం మాట్లాడారు అన్నది ఆహాలో చూడాలి. ఇక లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల కానుంది.