×
Ad

Kollywood : వారసులు అంతా కలిసి సినిమా చేయబోతున్నారా..? కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

విజయ్ వారసుడు ‘జాసన్ సంజయ్’ దర్శకుడిగా రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ వారసులు అంతా..

  • Published On : August 30, 2023 / 02:34 PM IST

Lyca Productions Jason Sanjay Dhruv Vikram Aditi Shankar A R Ameen

Kollywood : ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) వారసుడు ‘జాసన్ సంజయ్’ (Jason Sanjay) తన తండ్రిలా యాక్టింగ్ కెరీర్ వైపు కాకుండా డైరెక్షన్ వైపు అడుగులు వేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’ (Lyca Productions) బ్యానర్ లో జాసన్ తన మొదటి సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. కాగా ఈ మూవీ హీరోహీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారని నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.

Bro Movie : ఇండియాలోనే కాదు పాకిస్తాన్, బంగాళాదేశ్‌లో కూడా పవన్ కళ్యాణ్ బ్రో సందడి..

ఇది ఇలా ఉంటే, కొంతమంది మాత్రం తమకి నచ్చిన కాంబినేషన్స్ చెబుతూ.. ఇలా వస్తే మంచి కిక్ ఉంటుందని చెబుతున్నారు. ఇంతకీ వాళ్ళు చెబుతున్న కాంబినేషన్స్ ఏంటో ఒకసారి మీకు కూడా వినేయండి. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ‘దృవ్ విక్రమ్’ (Dhruv Vikram) ఇప్పటికే ఆడియన్స్ ని పలకరించిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి (Aditi Shankar) కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఏ ఆర్ రెహమాన్ తనయుడు అమీన్ (A. R. Ameen) పలు మ్యూజిక్ వీడియోలతో సంగీత దర్శకుడిగా ఆకట్టుకున్నాడు.

Chiranjeevi : ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కథ చిరంజీవి చేయాల్సింది.. నిర్మాత అశ్వినీదత్!

వీరందరూ కలిసి ఒక సినిమా చేస్తే అదిరిపోతోంది. ఆడియన్స్ లో మంచి క్రేజ్ వస్తుంది అంటూ పేర్కొంటున్నారు. అయితే కొంతమంది ఇంకో కాంబినేషన్ కూడా చెబుతున్నారు. అదేమి లేదు జస్ట్ హీరోయిన్ అదితి ప్లేస్ లో స్టార్ హీరో అజిత్ కుమార్తె అనౌష్క నటిస్తే మరింత క్రేజ్ వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్న లైకా ప్రొడక్షన్స్.. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుందట. మరి జాసన్ సంజయ్.. తన సినిమా కోసం ఎవరెవరిని క్యాస్ట్ చేసుకుంటాడో చూడాలి.