MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓడిపోతాడని ముందే చెప్పా, ఓటమికి కారణమిదే.. టీడీపీ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో మాట

  • Updated on- October 11, 2021 / 12:14 AM IST

Maa Elections 2021 Somireddy

MAA Elections 2021 : ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరిగాయి. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠ రేపిన మా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణం ఏంటో చెప్పారు. ప్రకాశ్ రాజ్ చేసిన ఒకే ఒక కామెంట్ ఈ ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణం అవుతుందని వారం కిందట మిత్రులతో చెప్పానని సోమిరెడ్డి వెల్లడించారు. సీనియర్ల ఆశీస్సులు తనకు అక్కర్లేదని ఇచ్చిన స్టేట్ మెంట్ తో ప్రకాశ్ రాజ్ తన ఓటమికి తానే బాటలు వేసుకున్నాడని సోమిరెడ్డి విశ్లేషించారు.

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

మంచు విష్ణు వినయవిధేయతలే ఆయన విజయానికి నాంది అవుతున్నాయని కూడా తాను చెప్పానని సోమిరెడ్డి వివరించారు. ఈ రోజు అదే నిజమైందని తెలిపారు. విజేతగా నిలిచిన విష్ణుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. విష్ణుకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా ఎన్నికలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది. విమర్శలు, ప్రతి విమర్శలతో టాలీవుడ్ వేడెక్కింది. అంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన మా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.

MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!

మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాష్ రాజ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందడంతో విష్ణు వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్‌పై ముందు నుంచి కూడా నాన్ లోకల్ ముద్ర బలంగా వేయడంలో విష్ణు బాగానే సక్సెస్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది.