MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

Maa Elections 2021

MAA Elections 2021 : టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. పెళ్లిసందD ప్రీ రిలీజ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో మా పరువు తీయవద్దని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. వివాదాలతో చులకన కావొద్దని అన్నారు. వివాదాలు సృష్టించిన వ్యక్తులను ఇండస్ట్రీకి దూరంగా పెట్టాలన్నారు. పదవులు తాత్కాలికం అన్న చిరంజీవి, చిన్న చిన్న పదవుల కోసం ఈగోలు వద్దన్నారు. మనమంతా వసుదైక కుటుంబం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఆధిపత్యం కోసం ఇతరులను కించపరచొద్దన్నారు. మనలో వివాదాల కారణంగా బయట వాళ్లకు లోకువ అవుతామన్నారు చిరంజీవి.

Also Read: Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

రోషన్ శ్రీలీల జంటగా నటించిన పెళ్లిసందD చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. వెంకటేశ్ తో తనకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉందని చిరు తెలిపారు. తన సినిమా బాగుంటే వెంకటేశ్ అభినందిస్తాడని, వెంకటేశ్ సినిమా బాగుంటే “ఏం చేశావయ్యా వెంకీ” అని తాను అభినందిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో అందరూ ఇలాగే ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా అని అన్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని చిరు అన్నారు. పదవుల కోసం అందరికీ లోకువ అయ్యేలా వ్యవహరిస్తున్నారని, ఒకరిని అనడం, అనిపించుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు. తాను ఏ ఒక్కరినీ వేలెత్తి చూపించడం లేదని, ప్రతి ఒక్కరూ విజ్ఞతతో వ్యవహరించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. మన ఆధిపత్యం చూపించుకోవడానికి ఎదుటివారిని కించపర్చాల్సిన అవసరం లేదని చిరంజీవి స్పష్టం చేశారు.

Also Read: దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

అసలు చిత్ర పరిశ్రమలో వివాదం ఎక్కడ ప్రారంభమైందో అందరూ తెలుసుకోవాలని, ఆ వివాదం ప్రారంభించిన వ్యక్తిని గుర్తించాలని అన్నారు. హోమియోపతి వైద్య విధానంలో మూలకారణాన్ని బట్టి చికిత్స చేస్తారని, ఇక్కడ అదే సూత్రం వర్తింపజేయాలని చిరంజీవి అన్నారు. వివాదానికి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయాలన్నారు. చిన్న చిన్న గొడవలతో బజారుకెక్కి మీడియా వాళ్లకు అవకాశం ఇవ్వొద్దని అన్నారు.

తీవ్ర ఉత్కంఠ రేపిన మా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ప్రకాశ్ రాజ్ పై 400కి పైగా ఓట్ల భారీ మెజారిటీతో విష్ణు విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లలో 60 శాతం మంచు విష్ణుకే లభించినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానెల్ కు ఇప్పటికే ట్రెజరర్ (కోశాధికారి), జనరల్ సెక్రటరీ పదవులు లభించడం తెలిసిందే. ట్రెజరర్ గా శివబాలాజీ, ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు ఎన్నికయ్యారు.

అంతేకాకుండా, ఈసీ మెంబర్లలోనూ విష్ణు ప్యానెల్ కు చెందిన 8 మంది విజయం సాధించారు. అటు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన శ్రీకాంత్ విజయం సాధించారు. మరో వైస్ ప్రెసిడెంట్ గా విష్ణు ప్యానెల్ కు చెందిన మాదాల రవి గెలుపొందారు. అటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి కూడా మరో వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ నెగ్గారు. జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్ (ప్రకాశ్ రాజ్ ప్యానెల్), గౌతమ్ రాజు (మంచు విష్ణు ప్యానెల్) విజయం సాధించారు.