విజయ్ దేవరకొండకు ‘మా’ మద్దతు- తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ ..

విజయ్ దేవరకొండకు ‘మా‘ తరపున మద్దతు తెలిపిన తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ ..

  • Publish Date - May 6, 2020 / 10:59 AM IST

విజయ్ దేవరకొండకు ‘మా‘ తరపున మద్దతు తెలిపిన తాత్కాలిక అధ్యక్షుడు బెనర్జీ ..

కొన్ని వెబ్‌సైట్లకు చెందిన వ్యక్తులు తనపై కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన విజయ్.. కరోనా సంక్షోభంలో తను చేస్తున్న సేవలపై ఆ వెబ్‌సైట్లు ప్రచురించిన తప్పుడు కథనాలపై ఫైర్ అయ్యాడు. ఇటువంటి ఫేస్‌న్యూస్‌ల వల్ల తను మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ బాధపడుతున్నారని అతను పేర్కొన్న నేపథ్యంలో పలువురు నటీనటులు, దర్శకులు విజయ్‌కి మద్దతు తెలుపారు.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రవితేజ, అల్లరి నరేష్, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ సుంకర, వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి, మధుర శ్రీధర్, రానా దగ్గుబాటి, బీవీఎస్ రవి, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారందరూ సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కూడా విజయ్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ‘మా’ యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ తాజాగా మీడియాతో మాట్లాడారు. 

‘ఈ లాక్‌డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ ఒక ఛారిటీ పెట్టి విరాళాలు పోగు చేసి పేదలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారు. దాంతో పాటు సీసీసీకి కూడా విరాళం ఇచ్చారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనుకునే విజయ్‌పై పలువురు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. వారిని నేను నిలదీస్తున్నా.  అసలు మీరు ఎవరు? ఎవరికి సహాయం చేయాలనేది మా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కొన్ని వెబ్‌సైట్లు చేస్తున్న నిరాధార ఆరోపణలతో చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోం. విజయ్ దేవరకొండకి మేం మద్దతుగా ఉంటాం. వెబ్‌సైట్లకు, సినిమా జర్నలిస్టులకి, సినీ పరిశ్రమకి ఇంటర్నెల్ లింక్ ఉంది. అందరం అన్నదమ్ములం. ఒక ఫ్యామిలీగా ఉండాలి. సినీ పరిశ్రమకి మీడియా సపోర్ట్ తప్పక కావాలి. అంత మాత్రం చేత తప్పుడు వార్తలు రాస్తామంటే కుదరదు. విజయ్‌కి జరిగినట్టు మరెవ్వరికి జరిగినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని బెనర్జీ అన్నారు. 

Also Read | ఫేక్ సైట్లపై నాగ్ ‘యాక్షన్ ప్లాన్’.. సర్వత్రా ఆసక్తి..