Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి ఫ‌స్ట్ సాంగ్ ‘మాట వినాలి’ వ‌చ్చేసింది.. ప‌వ‌న్ పాడిన పాట‌ను విన్నారా?

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు నుంచి తొలి పాట 'మాట వినాలి' సాంగ్‌ విడుద‌లైంది

Maatavinaali Song release from Pawan Kalyan Hari Hara Veera Mallu

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న మూవీల్లో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపుగా స‌గ భాగాన్నిక్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న త‌ప్పుకోగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

ఈ చిత్రంలోని మొద‌టి పాట మాట వినాలి సాంగ్‌ను విడుద‌ల చేసింది. ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. ‘మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి..’ అంటూ ఈ పాట సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

Urvashi Rautela : కియారా గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అని అంటున్నారు.. బాలయ్య హీరోయిన్ కామెంట్స్..

ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది.

తొలి భాగం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు-1 ది స్వార్డ్ వ‌ర్సెస్ స్పిరిట్ ఈ ఏడాది మార్చి 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

Sukumar Wife : సినిమా కోసం గుండు చేయించుకున్న సుకుమార్ కూతురు.. స్టేజిపై ఏడ్చేసిన సుకుమార్ భార్య..