Sukumar Wife : సినిమా కోసం గుండు చేయించుకున్న సుకుమార్ కూతురు.. స్టేజిపై ఏడ్చేసిన సుకుమార్ భార్య..

సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది.

Sukumar Wife : సినిమా కోసం గుండు చేయించుకున్న సుకుమార్ కూతురు.. స్టేజిపై ఏడ్చేసిన సుకుమార్ భార్య..

Sukumar Wife Thabitha Cried on Stage for Her Daughter Sukriti Veni First Film Work

Updated On : January 16, 2025 / 8:20 PM IST

Sukumar Wife : సుకుమార్ కూతురు సుకృతి వేణి మెయిన్ లీడ్ లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. గాంధీ తాత చెట్టు అనే ఈ సినిమా ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమాని జనవరి 24న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో నేడు ఈ సినిమా ప్రెస్ మెట్ నిర్వహించారు. అయితే ఈ సినిమా కోసం సుకృతి గుండు కూడా కొట్టించుకుంది. సినిమాలోనే తనకి గుండు కొట్టించే సీన్ ఉంటుంది.

ఈ ప్రెస్ మీట్ లో సుకుమార్ భార్య తబిత మాట్లాడుతూ.. డైరెక్టర్ కూతురు కాబట్టి సినిమాల్లోకి వస్తుంది అనుకోకూడదు. ఈ సినిమా అవార్డులకు వెళ్తే చాలు అనుకున్నాను. అందరూ అభినందించడం మొదలయ్యాక ఈ సినిమా అందరికి చేరుకోవాలని అనుకున్నాను. ఆయన్ని దగ్గర ఉండి టేక్ కేర్ చేయాలనుకుంటున్నాను కానీ సుకుమార్ నన్ను షూటింగ్స్ కి రానివ్వడు. అందుకే ఈ సినిమా షూటింగ్ కి వెళ్ళను. నాకు కథ సుకుమార్ పంపించాక నా కూతురికి ఇస్తే చదివి బాగుంది అని చెప్పింది అంతే. తను చేస్తా అని చెప్పలేదు. తర్వాత డైరెక్టర్, నిర్మాతలతో తనే మాట్లాడుకొని ఓకే చేసింది. మొదట నా కూతురి ట్యాలెంట్ నేను గమనించలేదు. నా కూతురు ఫస్ట్ షాట్ చూసి సుకుమార్ కి కాల్ చేసి చాలా బాగా చేస్తుంది అని ఎగ్జైట్ అయ్యాను అని తెలిపింది.

Also See : Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి భాగ్యం పాత్ర ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేష్.. పక్కనే మీనాక్షి కూడా..

ఇక తన కూతురు గుండు గీయించుకోవడం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో సాంగ్స్, తను హెయిర్ షేవ్ చేసుకున్నది చూస్తుంటే ఎమోషనల్ అయ్యాను. తను ఈ సినిమా చేస్తున్నప్పుడు 12 ఏళ్ళు. తనని చూసి గర్వపడుతున్నాను. టీన్స్ లో ఉన్న ఏ అమ్మాయి కూడా తన హెయిర్ షేవ్ చేసుకోడానికి ఒప్పుకోదు. కానీ తను చేసింది. తను మల్టీ ట్యాలెంటెడ్ పాడగలదు, నటించగలదు. ఏదైనా చేయగలదు అంటూ కూతురి గురించి చెప్తూ స్టేజిపైనే ఏడ్చేసింది. దీంతో సుకుమార్ స్టేజిపైకి వచ్చి భార్యని ఓదార్చాడు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటి సినిమాతోనే ఇంత సాహసం చేయడంతో సుకుమార్ కూతురు సుకృతిని అంతా అభినందిస్తున్నారు.

Also Read : VidaaMuyarchi Trailer : అజిత్ ‘విడాముయ‌ర్చి’ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ ..