Urvashi Rautela : కియారా గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అని అంటున్నారు.. బాలయ్య హీరోయిన్ కామెంట్స్..
తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలాను..

Urvashi Rautela says she Listened Kiara Game Changer is Disaster
Urvashi Rautela : దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ఇటీవల జనవరి 10న రిలీజయింది. అయితే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. పలువురు వేరే హీరోల ఫ్యాన్స్, కొంతమంది నెటిజన్లు సినిమాపై సోషల్ మీడియాలో బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఈ సినిమాని కావాలని కొంతమంది పైరసీ కూడా చేసారు. దీంతో మూవీ యూనిట్ కూడా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది.
ఈ సంక్రాంతికి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మంచి హిట్ కొట్టారు. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఓ పాత్ర చేసింది. అంతే కాకుండా బాలయ్యతో దబిడి దబిడి అంటూ స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ వేసింది. ఈ పాట, సినిమా రెండూ హిట్ అవ్వడంతో ఊర్వశి ఫుల్ హ్యాపీగా ఉంది.
Also Read : Brahma Anandam Teaser Launch : చాన్నాళ్ల తర్వాత సినిమా ఈవెంట్లో కనిపించిన బ్రహ్మానందం.. ఫోటోలు చూశారా?
అయితే తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలాను సినిమా ఫలితాల గురించి పట్టించుకుంటారా? మీ సినిమాతో పాటు బాలీవుడ్ నటి కియారా గేమ్ ఛేంజర్ సినిమా కుడా రిలీజయింది కదా అని అడిగారు. దీనికి ఊర్వశి రౌటేలా సమాధానమిస్తూ.. ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చే ట్యాగ్స్ ఉండాలి. అది కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తుంది సినిమా పరిశ్రమలో. వరల్డ్ వైడ్ మన యాక్టింగ్ స్కిల్స్ కి అభినందనలు వస్తాయి. నేను చాలా ట్వీట్స్ చదివాను. మా సినిమా మకర సంక్రాంతి ఫెస్టివల్ రోజు రిలీజయింది. అందరూ కియారా సినిమా డిజాస్టర్, ఊర్వశి సినిమా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు అని తెలిపింది. దీంతో ఊర్వశి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా చరణ్ ఫ్యాన్స్ ఊర్వశిని విమర్శిస్తున్నారు.
Also Read : Sukumar Daughter Sukriti Veni : సుకుమార్ కూతురు ఫస్ట్ సినిమా ఈవెంట్ ఫోటోలు..