Ram Charan : చరణ్ బర్త్ డేకి అభిమానులకు బహుమతి.. ఏంటది?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జోష్ లో ఉన్నాడు. ఒక పక్క RRR ఇచ్చిన సక్సెస్, మరో పక్క తండ్రి అవ్వబోతున్న సంతోషం. ఈ రెండు విషయాలు కేవలం చరణ్ కి మాత్రమే కాదు, అతని అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఈ హ్యాపీ టైంలోనే చరణ్ బర్త్ డే కూడా వచ్చేస్తుంది. దీంతో అభిమానులు కోసం చరణ్ మావయ్య అల్లు అరవింద్ ఒక బహుమతి..
- gum 95921
- Published On : February 23, 2023 / 10:50 AM IST
ram charan birthday
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం జోష్ లో ఉన్నాడు. ఒక పక్క RRR ఇచ్చిన సక్సెస్, మరో పక్క తండ్రి అవ్వబోతున్న సంతోషం. ఈ రెండు విషయాలు కేవలం చరణ్ కి మాత్రమే కాదు, అతని అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఈ హ్యాపీ టైంలోనే చరణ్ బర్త్ డే కూడా వచ్చేస్తుంది. దీంతో ప్రతి ఏడు చరణ్ బర్త్ డేని ఒక సోషల్ ఈవెంట్ గా నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు ఫ్యాన్స్. అలాంటి అభిమానులు కోసం చరణ్ మావయ్య అల్లు అరవింద్ ఒక బహుమతి ప్లాన్ చేస్తున్నాడు.
Ram Charan : నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అల్లుడు.. చరణ్ పై అత్త ట్వీట్!
రామ్ చరణ్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు, రాజమౌళి కెరీర్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఒక మైలు రాయిగా నిలిచిన మూవీ ‘మగధీర’. సోషియో ఫాంటాసి డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. వారియర్ గా రామ్ చరణ్ యుద్దాలు, మహారాణిగా కాజల్ అగర్వాల్ అందాలు, రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం.. ఇలా ప్రతిదీ సినిమాని ఒక అద్భుతంగా మలిచాయి. ఆ సినిమాని చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని గీత ఆర్ట్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ వార్త తెలియడంతో చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం RC15 చిత్రంలో నటిస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరో తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథని అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని చరణ్ బర్త్ డేకి రిలీజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.
On the occasion of ???? ????????? @AlwaysRamCharan Birthday! ?
Re-Releasing the Sensational ???????? ??? #Magadheera in theaters ?#MagadheeraReRelease ?@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a
— Geetha Arts (@GeethaArts) February 23, 2023
