Ram Charan : నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అల్లుడు.. చరణ్ పై అత్త ట్వీట్!

స్వయంకృషితో వచ్చి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన చిరంజీవి కొడుకు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు. అందరి మదిలో ఒకటే ఆలోచన చిరంజీవి స్థాయిని అందుకోగలడా? ఆ ప్రశ్నతో మొదలైన రామ్ చరణ్ కెరీర్..

Ram Charan : నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అల్లుడు.. చరణ్ పై అత్త ట్వీట్!

ram charan

Updated On : February 22, 2023 / 9:45 PM IST

Ram Charan : స్వయంకృషితో వచ్చి ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిన చిరంజీవి కొడుకు ఇండస్ట్రీకి వస్తున్నాడు అని తెలిసినప్పుడు. అందరి మదిలో ఒకటే ఆలోచన చిరంజీవి స్థాయిని అందుకోగలడా? ఆ ప్రశ్నతో మొదలైన రామ్ చరణ్ కెరీర్ అసలు ఎవరు ఊహించని స్థాయికి చేరుకుంది. కెరీర్ మొదటిలో ఎన్నో ట్రోలింగ్స్ గురైన చరణ్.. నటుడిగా తనని తాను మెరుగు పరుచుకుంటూ, నేడు ఎంతోమంది కీర్తించే స్థాయికి చేరుకున్నాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో అయితే ఇండియా వైడ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు.

Ram Charan : రామ్‌చరణ్‌కి మరో అరుదైన గౌరవం.. పాపులర్ అమెరికన్ షోకి గెస్ట్‌గా!

అవతార్ వంటి సినిమా తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సైతం ఆర్ఆర్ఆర్ లోని చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు అంటే రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎత్తుకి ఎదిగాడో అర్ధమవుతుంది. హాలీవుడ్ మీడియా అయితే చరణ్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ అంటూ కథనాలు రాసుకొచ్చాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. అమెరికాలో అత్యధిక మంది వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన షో.. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’. ఈ టాక్ షోకు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లబోతున్నాడు. ఇండియన్ నుంచి ఈ షోకి వెళుతున్న మొదట ఇండియన్ సెలెబ్రెటీ రామ్ చరణ్.

రామ్ చరణ్ ఈ గౌరవం అందుకోవడంతో ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి.. ‘చరణ్ అభినందిస్తూ ట్వీట్ చేసింది. గుడ్ మార్నింగ్ అమెరికా షోకి గెస్ట్ గా వెళుతున్న ఫస్ట్ ఇండియన్ సెలెబ్రెటీ రామ్ చరణ్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది అల్లుడు’ అంటూ ట్వీట్ చేసింది. కాగా ఈ షో ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 11.30 ISTకి ఈ షో ప్రసారం కానుంది. ఇది ఇలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ కి రామ్‌ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ అవార్డ్స్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా రామ్ చరణ్ కావడం గమనార్హం.