Maharshi Raghava : నటుడు మహర్షి రాఘవ తల్లి మృతి..

తాజాగా మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ ఇవాళ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మహర్షి రాఘవ...........

Maharshi Raghava

Maharshi Raghava :   ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనాతో లేక ఇతర ఆరోగ్య సమస్యలతో ఇటీవల వరుసగా చాలా మంది సినీ సెలబ్రిటీలు అన్ని పరిశ్రమలలోను మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది.

మహర్షి సినిమాతో పాపులర్ అయి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మలుచుకున్నారు మహర్షి రాఘవ. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం సినిమాలలో, సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. తాజాగా మహర్షి రాఘవ తల్లి గోగినేని కమలమ్మ ఇవాళ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 84 సంవత్సరాలు.

Balakrishna : బప్పి లహరి మరణంపై బాలకృష్ణ సంతాపం

ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు మహర్షి రాఘవ. రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. పలువురు సినీ, టీవీ ప్రముఖులు మహర్షి రాఘవ తల్లి మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.