టాలివుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు న్యూమరాలజీని పక్కాగా ఫాలో అవుతున్నాడు. నెంబర్ల తో లక్కు కలిసొస్తుందని ప్రిన్స్ గట్టిగా నమ్ముతున్నాడు. అందుకే అన్ని విషయాల్లోనూ లక్కీ నెంబర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు. ఇంతకీ..మహేశ్ లక్కీ నెంబర్ ఏది..?
వంశీ పైడిపల్లి దర్శకత్వం లో మహేశ్ బాబు హీరోగా నటిస్తోన్న సినిమా మహర్షి. ఈ మూవీ మహేశ్ కి 25వ సినిమా. అందుకే మహర్షి పై భారీ అంచనాలున్నాయి. మే 9న మహర్షి ఆడియన్స్ ముందుకి రానుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 6న ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మహర్షి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక మహర్షి సక్సెస్ కోసం మహేశ్ బాబు తన లక్కీ నెంబర్ నైన్ ని ఫాలో అవుతున్నాడు. సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ ఇచ్చినా డేట్, టైం అన్నింట్లోనూ నైన్ ఉండేలా చూసుకుంటున్నాడు.
మహర్శి సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి మహేశ్ నెంబర్ నైన్ సెంటిమెంట్ ని పక్కాగా ఫాలో అవుతున్నాడు. అంతేకాదు మహేశ్ బర్త్ డే కూడా ఆగష్టు తొమ్మిదే. గతేడాది మహేశ్ బర్త్ డే సందర్భంగానే ఆగష్టు తొమ్మిదిన తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి మహర్షి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సాంగ్ చోటీ చోటీ బాతేన్ కూడా ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకే విడుదల చేశారు.
న్యూమరాలజీ ప్రకారం ‘నైన్’ లక్కీ నెంబర్. అందుకే లక్కు కోసం మహేశ్ లక్కీ నెంబర్ ని నమ్ముకుంటున్నాడు. మరి నెంబర్ నైన్ సెంటిమెంట్ సూపర్ స్టార్ కి సక్సెస్ ని కట్టబెడుతుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం మహర్షి షూటింగ్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో జరుగుతోంది. మహేశ్, పూజా హెగ్డె మధ్య సాంగ్ ని మూవీటీం చిత్రీకరిస్తోంది. టాకీపార్ట్ రీసెంట్ గా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది.