Mahesh Babu : నా కెరీర్‌ని మలుపు తిప్పింది.. ఆ మూడు సినిమాలే..

తన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు ఆ మూడు చిత్రాలే అంటున్న మహేష్ బాబు. ఏంటి అవి..?

Mahesh Babu about his movies which should mould his career

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీస్ అంటే ఆడియన్స్ కి కొన్ని సినిమాలు గుర్తుకు వస్తాయి. అవేంటంటే.. మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు సినిమాలు. ఈ సినిమాలు మహేష్ బాబుని బడా మాస్ హీరోని చేయడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో టాలీవుడ్ లో కొత్త రికార్డులను సృష్టించింది.

అయితే ఇవి ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ చెప్పే ల్యాండ్ మార్క్ మూవీస్. మరి మహేష్ విషయంలో తన కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు అంటే ఏంటి..? ఈ విషయం గురించి మహేష్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సమాధానాన్ని తెలియజేసారు.

“నా కెరీర్ లో నన్ను ప్రభావితం చేసి, నా కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమాలు అంటే మురారి, పోకిరి, శ్రీమంతుడు. ఈ చిత్రాలు నన్ను ఆడియన్స్ కి బాగా దగ్గర చేసాయి. ఆ చిత్రాలు లాగానే ఆడియన్స్ కి నచ్చేలా, అలాగే నైతిక అంశాలు ఉండేలా కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను. ఈక్రమంలోనే నేను చేసే పాత్రలు నా స్వభావాన్ని ఫ్యాన్స్ కి తెలియజేసేలా చూసుకుంటాను.

Also read : Ram Charan : షారుఖ్ రామ్‌చరణ్‌ని అవమానించలేదు.. తన మూవీలోని డైలాగ్‌ని చెప్పాడు.. వీడియోతో క్లారిటీ..

ఇక ఇన్నాళ్ల ప్రయాణంలో సినిమా విజయం పై నా ఆలోచనా సరళి కూడా మారింది. సినిమాకి బాక్సాఫీస్‌ కలెక్షన్స్ అనేవి ఎంత ముఖ్యమో.. ఆ సినిమా ఆడియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా అంతే ముఖ్యం. అది కూడా సినిమా విజయానికి కారణం అవుతుంది. సినిమాలో కనిపించే ప్రతి పాత్రకి నెగటివ్ ఛాయలు ఉంటాయి. కాబట్టి ప్రతి పాత్ర ఏదో ఒక నైతిక విషయాన్ని అంతర్లీనంగా చెబుతూనే ఉంటుంది.

ఈక్రమంలోనే ఒక పాత్రని నేను అంగీకరించిన తరువాత ఆ క్యారెక్టరైజేషన్‌కు లొంగిపోతాను. దర్శకుడు చెప్పిన విధంగా ఆ పాత్రని చేసుకుంటూ వెళ్తాను. ఆ పాత్రకి గ్రే షేడ్స్ ఉన్నపటికీ.. ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులు ఏది తప్పో ఒప్పో గుర్తించేంత పరిణతి సాధించారని నేను భావిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు