×
Ad

Mahesh Babu : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్ళీ మహేష్ బాబు.. కానీ ఈ సారి..

అనిల్ రావిపూడి మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ తో షూటింగ్ సెట్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి..

  • Published On : March 8, 2024 / 06:20 PM IST

Mahesh Babu Acting in Anil Ravipudi Direction Photo goes Viral

Mahesh Babu – Anil Ravipudi : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు గతంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాతో వచ్చారు. 2020 సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. ఫుల్ లెంగ్త్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులని మెప్పించింది ఈ సినిమా. తాజాగా మరోసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నాడు.

అనిల్ రావిపూడి మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ తో షూటింగ్ సెట్ లో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. మరోసారి బాబుతో వర్క్ చేస్తున్నాను. కానీ ఈ సారి యాడ్ కోసం. నా హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేయడం నాకు సంతోషంగా, ఎగ్జైట్ గా ఉంటుంది. అభిబస్ యాడ్ త్వరలో రాబోతుంది అని పోస్ట్ చేశారు. దీంతో అభిబస్ కొత్త యాడ్ కోసం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.

Also Read : Rajamouli : నాకు ఆ అమ్మాయి నచ్చింది అంటున్న రాజమౌళి.. ‘ప్రేమలు’ సినిమా గురించి చెప్తూ..

ఇక మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. వీళ్ళ కాంబోలో వచ్చే SSMB29 సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.