నాకు ఆ అమ్మాయి నచ్చింది అంటున్న రాజమౌళి.. ‘ప్రేమలు’ సినిమా గురించి చెప్తూ..

తాజాగా ప్రేమలు సినిమా చూసిన రాజమౌళి రివ్యూ ఇచ్చారు.

నాకు ఆ అమ్మాయి నచ్చింది అంటున్న రాజమౌళి.. ‘ప్రేమలు’ సినిమా గురించి చెప్తూ..

Rajamouli Comments on Premalu Movie and Actress Mamitha Baiju

Updated On : March 8, 2024 / 6:39 PM IST

Rajamouli : మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు'(Premalu) సినిమా నేడు తెలుగులో కూడా రిలీజయింది. ఫహద్ ఫాజిల్ నిర్మాణంలో గిరీష్ AD దర్శకత్వంలో నస్లెన్ గఫూర్, మమిత బైజు(Mamitha Baiju) మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఆల్రెడీ నిన్నే ప్రీమియర్స్ పడ్డాయి తెలుగులో. ప్రేమలు సినిమాకి తెలుగులో కూడా మంచి టాక్ వస్తుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా లవ్, కామెడీ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులని, ముఖ్యంగా యూత్ ని మెప్పిస్తుంది.

తాజాగా ఈ సినిమా చూసిన రాజమౌళి దీనిపై రివ్యూ ఇచ్చారు. రాజమౌళి తన సోషల్ మీడియాలో ప్రేమలు సినిమా గురించి రాస్తూ.. కార్తికేయ ప్రేమలు సినిమాని తెలుగులో రిలీజ్ చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్ కి తగ్గట్టు మీమ్స్, యూత్ లాంగ్వేజ్ లో రైటింగ్ పర్ఫెక్ట్ గా, బాగా రాశారు. ట్రైలర్ చూసినప్పటి నుంచే ఈ సినిమాలో రీనూ పాత్ర చేసిన అమ్మాయి నాకు నచ్చింది. సచిన్ పాత్ర చేసిన అబ్బాయి కూడా మెప్పించాడు. కానీ నాకు ఈ సినిమాలో ఆది పాత్ర బాగా నచ్చింది అంటూ రివ్యూ ఇచ్చారు.

 

Also Read : ‘ప్రేమలు’ మూవీ రివ్యూ.. సింగిల్ బాయ్స్ కచ్చితంగా చూడాల్సిందే..

దీంతో రాజమౌళి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రేమలు సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు అయితే తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్, స్మైల్, నటనతో అందర్నీ మెప్పిస్తూ తెలుగులో కూడా యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఏకంగా రాజమౌళినే మెప్పించింది ఈ అమ్మాయి. మరి భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో మమిత బైజు నటిస్తుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Mamitha Baiju (@mamitha_baiju)