×
Ad

Mahesh Babu Krishna : తండ్రి కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా? ఏమేం సినిమాలు..

కృష్ణతో కలిసి మహేష్ దాదాపు 11 సినిమాలో కలిసి నటించాడు. అంతే కాకుండా తండ్రి దర్శకత్వంలో కూడా నటించాడు మహేష్.(Mahesh Babu Krishna)

Mahesh Babu Krishna

Mahesh Babu Krishna : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నప్పుడే సినీ పరిశ్రమలోకి వచ్చి ఇప్పుడు సూపర్ స్టార్ గా దూసుకుపోతున్నారు మహేష్ బాబు. మహేష్ కి తండ్రితో చిన్నప్పట్నుంచి మంచి అనుబంధం ఉంది. కృష్ణతో కలిసి మహేష్ దాదాపు 11 సినిమాలో కలిసి నటించాడు. అంతే కాకుండా తండ్రి దర్శకత్వంలో కూడా నటించాడు మహేష్.(Mahesh Babu Krishna)

కృష్ణ – మహేష్ బాబు కలిసి నటించిన సినిమాలు పోరాటం, శంఖారావం, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బజార్ రౌడీ, అన్నాతమ్ముడు, బాలచంద్రుడు, రాజకుమారుడు, వంశీ, టక్కరిదొంగ. ఇలా ఆల్మోస్ట్ 11 సినిమాల్లో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటించారు. అయితే వీటిలో కొన్ని కృష్ణ డైరెక్ట్ చేయగా తండ్రి దర్శకత్వంలో నటించే ఛాన్స్ దొరికింది మహేష్ బాబుకి.

Also Read : Chiranjeevi Venkatesh : కొండవీటి రాజా – బొబ్బిలి రాజా ఒకే ఫ్రేమ్ లో.. టైగర్ మోడల్ డ్రెస్ లో.. ఫొటో వైరల్..

కృష్ణ దర్శకత్వంలో మహేష్ బాబు.. 1987లో శంఖారావం, 1988లో ముగ్గురు కొడుకులు, 1989లో కొడుకు దిద్దిన కాపురం, 1990లో అన్నాతమ్ముడు, 1990లో బాలచంద్రుడు.. ఇలా 5 సినిమాల్లో నటించాడు. ఈ అయిదు సినిమాల్లోనూ కృష్ణ మెయిన్ లీడ్ కావడం గమనార్హం. ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క డైరెక్షన్ చేస్తూ మరో పక్క కొడుకుని కూడా డైరెక్ట్ చేసారు కృష్ణ. వీటిలో కొన్నిటికి ఆయనే నిర్మాత కావడం గమనార్హం.