Mahesh Babu : అక్క బర్త్ డే సెలబ్రేషన్స్ కు హాజరైన మహేష్ బాబు.. మహేష్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉందిగా.. ఫొటో వైరల్..

తాజాగా మహేష్ బాబు తన అక్క మంజుల ఘట్టమనేని బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరయ్యాడు.

Mahesh Babu and Ghattamaneni Family Attends Manjula Ghattamaneni Birthday Celebrations Photo Viral

Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ఆ సినిమా లోకేషన్స్ వేటలో ఉన్నాడు. లొకేషన్స్ ఫైనల్ అవ్వగానే రాజమౌళి సినిమా షూట్ లో జాయిన్ కానున్నాడు మహేష్. ఆ సినిమా కోసం జుట్టు, గడ్డం, బాడీ పెంచుతూ రెడీ అవుతున్నాడు మహేష్. తాజాగా మహేష్ బాబు తన అక్క మంజుల ఘట్టమనేని బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరయ్యాడు.

Also Read : Killi Kranthi : ఈ ఆర్టిస్ట్ మాజీ వైసీపీ నేత కొడుకు.. చిరంజీవి సినిమాతో ఎంట్రీ.. ఇప్పుడు పుష్ప, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీ..

మంజుల ఘట్టమనేని తన బర్త్ డే రోజు తన ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫ్యామిలీతో సంతోషంతో, ప్రేమతో నా బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాను. వీళ్లంతా కలిసి నా బర్త్ డేని స్పెషల్ గా మార్చారు అని పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలో మహేష్ బాబు, నమ్రత, సితార, సుధీర్ బాబు, సుధీర్ బాబు భార్య, మహేష్ అన్నయ్య కొడుకు, కూతురు.. ఇలా మహేష్ బాబు ఫ్యామిలీ అంతా ఉన్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఫోటో వైరల్ చేస్తున్నారు.