Killi Kranthi : ఈ ఆర్టిస్ట్ మాజీ వైసీపీ నేత కొడుకు.. చిరంజీవి సినిమాతో ఎంట్రీ.. ఇప్పుడు పుష్ప, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీ..

కిల్లి క్రాంతి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నాడు.

Killi Kranthi : ఈ ఆర్టిస్ట్ మాజీ వైసీపీ నేత కొడుకు.. చిరంజీవి సినిమాతో ఎంట్రీ.. ఇప్పుడు పుష్ప, గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీ..

Do You Know about Character Artist Killi Kranthi Ex Central Minister Son Film Career Starts with Chiranjeevi Film

Updated On : November 20, 2024 / 3:39 PM IST

Killi Kranthi : ఇప్పటికే తెలుగు, తమిళ్ లో అనేక సినిమాలు చేసిన కిల్లి క్రాంతి ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం పుష్ప, రాజాసాబ్, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించాడు. మరిన్ని పెద్ద సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. తాజాగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రాంతి తన సినిమాల గురించి తెలిపాడు. పుష్ప 2 సినిమాలో తన క్యారెక్టర్ తన కెరీర్ కి మరింత ప్లస్ అవుతుందని తెలిపాడు.

అయితే ఈ క్రాంతి ఎవరో కాదు మాజీ కేంద్రమంత్రి, మాజీ వైసీపీ నేత కిల్లి కృపారాణి తనయుడు. గతంలో మొదట కాంగ్రెస్ లో ఉండగా శ్రీకాకుళం నుంచి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అయ్యారు కిల్లి కృపారాణి. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఇటీవలే కాంగ్రెస్ లోకి తిరిగివచ్చారు. కిల్లి కృపారాణి తనయుడు కిల్లి క్రాంతి ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం అతని చేతిలో చాలా సినిమాలు ఉన్నట్టు తెలిపారు.

Also Read : Ram Charan – Upasana : రామ్ చరణ్ పై విమర్శలకు ఉపాసన సమాధానం.. ఏమని చెప్పిందంటే..

కిల్లి క్రాంతి లాస్ ఏంజిల్స్ లో ఓ యూనివర్సిటీలో 6 మంత్స్ ఫిలిం కోర్స్ చేసి, మళ్ళీ ఇండియాకు వచ్చి సత్యానంద్ గారి దగ్గర కూడా యాక్టింగ్ నేర్చుకొని, మళ్ళీ బ్యాంకాక్ వెళ్లి ఫైట్స్ నేర్చుకున్నాడు. చిరంజీవి రీ ఎంట్రీతోనే తన సినిమా ఎంట్రీ జరగాలని కోరుకున్నాడట. అతను కోరుకున్నట్టే అతని ఫస్ట్ సీన్, ఫస్ట్ స్క్రీన్ ఎంట్రీ, ఫస్ట్ డైలాగ్ చిరంజీవి గారితోనే అయ్యిందట. ఖైదీ నెంబర్ 150 సినిమాతోనే కిల్లి క్రాంతి ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలిపాడు.

View this post on Instagram

A post shared by Kranthi Smile (@kranthi.killi)