Ram Charan – Upasana : రామ్ చరణ్ పై విమర్శలకు ఉపాసన సమాధానం.. ఏమని చెప్పిందంటే..

అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు ఎలా వెళ్తారు అంటూ పలువురు చరణ్ పై విమర్శలు చేసారు.

Ram Charan – Upasana : రామ్ చరణ్ పై విమర్శలకు ఉపాసన సమాధానం.. ఏమని చెప్పిందంటే..

Upasana Counter to who Trolls Ram Charan for Visiting Kadapa Dargah

Updated On : November 20, 2024 / 3:09 PM IST

Ram Charan – Upasana : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. అయితే ఇటీవల చరణ్ ఆయప్ప మాలలో ఉన్నప్పుడే కడప దర్గాను సందర్శించాడు. ఏఆర్‌ రెహ్మాన్‌ కోరిక మేరకు క‌డ‌ప ద‌ర్గాలో జరిగే 80వ జాతీయ ముషైరా గ‌జ‌ల్ ఈవెంట్‌కు చరణ్ హాజరయ్యాడు. కడప దర్గాను సందర్శించి ఆ ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ.. మగధీర సినిమా రిలీజ్ ముందు కూడా ఇక్కడికి వచ్చాను. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. రెహమాన్ గారికి మాట ఇచ్చాను కడప దర్గాకు వస్తానని. అందుకే మాలలో ఉన్నా కూడా వచ్చాను. ఈ దర్గా నాకు ఎంతో ప్రత్యేకమైనది అని కామెంట్స్ చేసారు.

అయితే అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు దర్గాకు ఎలా వెళ్తారు అంటూ పలువురు చరణ్ పై విమర్శలు చేసారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని మెగా ఫ్యాన్స్ చరణ్ ని అభినందిస్తున్నా కొంతమంది సోషల్ మీడియాలో చరణ్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ విమర్శలపై ఉపాసన సమాధానమిచ్చింది.

Also Read : Satyadev : నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే అని నా ఫోన్ తీసుకొని.. చిరంజీవిపై సత్యదేవ్ కామెంట్స్.. ఇది కదా మెగాస్టార్ అంటే..

ఉపాసన చరణ్ దర్గాని సందర్శించిన ఫోటో షేర్ చేసి.. దేవుడిపై విశ్వాసం అనేది అందరిని కలుపుతుంది కానీ విడగొట్టదు. భారతీయులుగా మేము అన్ని మతాలను గౌరవిస్తాము. ఐకమత్యం మా బలంతోనే ఉంది. రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలని కూడా గౌరవిస్తారు అని రాసి వన్ నేషన్ వన్ స్పిరిట్, జైహింద్ అని పోస్ట్ చేసారు. దీంతో ఉపాసన ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే కొంతమంది ఫ్యాన్స్ కూడా విమర్శకులకు సమాధానం ఇచ్చేలా పోస్టులు చేస్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్నవారు శబరిమల వెళ్లేముందు ఎరుమేళిలోని వావర్ స్వామి దర్గాను దర్శించుకొని వెళ్తారు అని గుర్తుచేస్తూ మన మతాన్ని ఆరాధిస్తూనే పక్క మతాలను గౌరవించాలని చెప్తున్నారు.