బర్త్‌డే పార్టీలో మహేష్‌, తారక్‌ సందడి!

ఈ జనరేషన్‌ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు.

  • Publish Date - April 9, 2019 / 05:44 AM IST

ఈ జనరేషన్‌ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు.

ఈ జనరేషన్‌ హీరోలు ఈగోలను పక్కన పెట్టి కలిసిపోతున్నారు. ఒకరి సినిమాలను ఒకరు ప్రమోట్ చేయటంలో పాటు ప్రైవేట్ పార్టీలలోనూ సందడి చేస్తున్నారు. సోమవారం రాత్రి (ఏప్రిల్ 8, 2019)న దర్శకుడు వంశీ పైడిపల్లి తన భార్య మాలిని పుట్టిన రోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చాడు. ఈ పార్టీకి మహేష్, తారక్ లు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతా కలిసి సందడి చేస్తు తీసుకున్న సెల్పీని నమ్రత తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. 
Read Also : సమంత జిమ్నాస్టిక్ కెరీర్ కు గుడ్ బై

అయితే లాస్ట్ ఇయర్ జూలైలో కూడా వంశీ పుట్టినరోజు వేడుకలో మహేష్‌బాబు, ఎన్టీఆర్ తోపాటు రామ్ చరణ్ కూడా కలిసి ఎంజాయ్ చేసారు. అయితే ఈసారి చరణ్ హాజరుకాలేదు. బహుశా గాయం కారణంగా చరణ్ విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు. ఈ ముగ్గురు హీరోలూ వంశీ దర్శకత్వంలో పనిచేసినవారే. ఇప్పటికే ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలను తెరకెక్కించిన వంశీ.. ప్రస్తుతం మహేష్‌తో ‘మహర్షి’ సినిమాను తీస్తున్నారు. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే