Sitara – Mahesh Babu : దుబాయ్‌లో సితార పాపతో సూపర్‌స్టార్..
సూపర్‌స్టార్ మహేష్ బాబు గతకొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు..
- sekhar
- Published On : December 29, 2021 / 04:11 PM IST
Sitara
Sitara – Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు గతకొద్ది రోజులుగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల మోకాలు సర్జరీ కారణంగా ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు మహేష్.
Nivetha Thomas : ‘జై బాలయ్య’ పాటకు నివేదా థామస్ డ్యాన్స్! వీడియో వైరల్
ఎప్పటిలానే పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి దుబాయ్‌లోని పలు ప్లేసెస్ విజిట్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. రీసెంట్‌గా సితార పాప మహేష్ కలిసి ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను తెగ షేర్ చేసేస్తున్నారు. మహేష్ శ్రీమతి నమ్రత ఈ బ్యూటిఫుల్ పిక్స్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు.
SSMB 28 : సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ అదిరిందిగా..
‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్, త్రివిక్రమ్‌తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల త్రివిక్రమ్, థమన్, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ దుబాయ్ వెళ్లి మహేష్ బాబుని కలిశారు. ఆ పిక్స్‌లో మహేష్ లుక్ బాగుందంటూ కామెంట్స్ వచ్చాయి. త్వరలో మహేష్-త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కబోతోంది.
