Mahesh Babu creates new trend with Guntur Kaaram pre release event
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘గుంటూరు కారం’ మరో పది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ మూవీ నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నారట. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ నిర్వహించబోతున్నారు..? అనేది అందరిలో ఆసక్తిగా ఉంది.
ముఖ్యంగా విజయవాడ, గుంటూరు అభిమానులు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక అప్డేట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ఈ చిత్రానికి గుంటూరు కారం అనే టైటిల్ పెట్టడంతో.. ఆ ప్రాంతంలో ఈ ఈవెంట్ ని నిర్వహిస్తారేమో అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోనే నిర్వహించనున్నారని తెలుస్తుంది. జనవరి 6న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందట. ఆ రోజే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారట.
Also read : Yatra 2 : యాత్ర 2 టీజర్‌కి డేట్ ఫిక్స్ అయ్యింది.. ఎప్పుడంటే..?
ఇది ఇలా ఉంటే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్స్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారట. కాలిఫోర్నియా సినీ లాంజ్ ఫ్రీమాంట్ సెవెన్ సినిమాస్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుందట. ఇలా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో లైవ్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దీంతో మహేష్ బాబు మరో కొత్త ట్రెండ్ ని సెట్ చేసి.. ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటున్నారు.
The time has come for the celebrations! ?
For the first time in history, experience the live screening of #GunturKaaram Pre-Release Event in the USA ?
? Cine Lounge Fremont 7 Cinemas, California
More details soon! @PrathyangiraUS ⏳#GKUSAPreReleaseEvent
Super?… pic.twitter.com/K05roKpFCJ
— Guntur Kaaram (@GunturKaaram) January 2, 2024
కాగా గతంలో టీజర్, గ్లింప్స్, మోషన్ పోస్టర్.. ఇలా చాలా ట్రెండ్స్ ని మహేష్ స్టార్ట్ చేశారు. ‘ఖలేజా’తో టీజర్ రిలీజ్, ‘స్పైడర్’తో గ్లింప్స్ రిలీజ్, ‘1-నేనొక్కడినే’తో మోషన్ పోస్టర్ రిలీజ్, ‘1-నేనొక్కడినే’ని థియేటర్‌లో లైవ్ టెలికాస్ట్ చేయడం, ఈవెంట్‌లో ‘Q&A’ సెషన్ నిర్వహించడం, ‘ఆగడు’ ఫస్ట్ లుక్‌ని ఫ్యాన్స్‌తో విడుదల చేయించడం, ‘పోకిరి’తో రీ రిలీజ్ ట్రెండ్‌ని.. ఇలా ఇవ్వని స్టార్ట్ చేసి ట్రెండ్ సెట్టర్ గా ఉన్నారు. ఇప్పుడు మరో ట్రెండ్ ని స్టార్ట్ చేశారు.