Sitara : హాలీవుడ్ భామతో మహేశ్ కూతురు సితార.. సెల్ఫీ పిక్స్ వైరల్..
అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ కుటుంబం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2024 / 04:33 PM IST
Mahesh Babu daughter Sitara pouts in selfie with Kim Kardashian from Anant Ambani wedding
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కొడుకు పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడకకు సినీ, రాజకీయ, క్రీడారంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖలు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబులు తమ కుటుంబ సమేతంగా వెళ్లారు.
అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ కుటుంబం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కూతురు సితార, భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. మహేశ్ గారాల పట్టి సితార పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలతో ఫోటోలు దిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారా..? వీడియోతో క్లారిటీ ఇచ్చేశారు
హాలీవుడ్ భామ కిమ్ కర్దాసియాన్‌తో సితార సెల్పీలు దిగింది. వీరిద్దరూ నవ్వుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలకు సితార ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు గానీ కిమ్‌ను ట్యాగ్ చేసింది. కాగా.. ఈ పోస్ట్ పై నమ్రత లవ్‌యూ ఎమోజీలతో స్పందించింది.
ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ మూవీ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గానే జరుగుతుందని సమాహారం. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందని, మ్యూజిక్ వర్క్ కూడా జరుగుతుందని పలువురు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
