Kannappa : మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప’.. అదిరిపోయే అప్‌డేట్‌..

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని శరవేగంగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Kannappa : మంచు విష్ణు ‘క‌న్న‌ప్ప’.. అదిరిపోయే అప్‌డేట్‌..

Sarath Kumar as Nathanadhudu in Manchu Vishnu Kannappa movie

Manchu Vishnu-Kannappa : మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని శరవేగంగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మ‌ల‌యాళ స్టార్ న‌టుడు మోహ‌న్ లాల్‌, లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, శివ‌రాజ్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా స్టార్ న‌టుడు శ‌ర‌త్‌కుమార్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రంలోని ఆయ‌న ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. నాథనాధుడు పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. రెండు చేతుల‌తో రెండు ఖ‌డ్గాలు ప‌ట్టుకుని ఎంతో ఆవేశంగా ఉన్న శ‌ర‌త్‌కుమార్ లుక్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Rajinikanth : అంబానీ పెళ్లిలో.. అమితాబ్‌ను చూడ‌గానే సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఏం చేశాడంటే.. వీడియో..

శివుడి ఆరాధ్య భక్తుడు కన్నప్ప ఇతిహాస ప్రయాణాన్ని చూపించబోతున్నాం. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను పొందేందుకు రెడీగా ఉండండి..అంటూ మేకర్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ శివుడిగా క‌నిపించ‌నున్నారు.. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.