×
Ad

Guntur Kaaram : ‘గుంటూరు కారం’ టీవీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?

టీవీల్లో ఫ్యామిలీల ముందు గుంటూరు కారం సినిమా సందడి చేయనుంది. ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

  • Published On : March 24, 2024 / 08:48 AM IST

Mahesh Babu Guntur Kaaram Movie TV Telecasting Date Announced Full Details Here

Guntur Kaaram : ఇటీవల సంక్రాంతికి మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. హారికా హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా రమ్యకృష్ణ, జయరామ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరరావు, జగపతి బాబు, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో గుంటూరు కారం సినిమా తెరకెక్కింది. సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన గుంటూరు కారం సినిమా యాక్షన్ సీన్స్ తో పాటు మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులని ఆకట్టుకొని భారీ విజయం సాధించింది.

గుంటూరు కారం సినిమా ఆల్మోస్ట్ 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజవ్వగా నెల రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి వచ్చేసింది. ఇప్పుడు బుల్లితెరపైకి రానుంది. టీవీల్లో ఫ్యామిలీల ముందు గుంటూరు కారం సినిమా సందడి చేయనుంది. ఎక్కడ? ఎప్పుడో తెలుసా?

Also Read : Ayesha Khan : టాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ బిగ్‌బాస్ భామ.. ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి..

గుంటూరు కారం సినిమా జెమినీ టీవిలో ఈ ఉగాది రోజున టెలికాస్ట్ కానుంది. డేట్ ప్రకటించకపోయినా ఉగాది రోజు అని తెలుపుతూ పోస్ట్ చేసారు. ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9న జరుపుకుంటున్నారు. దీంతో గుంటూరు కారం సినిమా జెమినీ టీవీలో ఏప్రిల్ 9న టెలికాస్ట్ కాబోతుందని తెలుస్తుంది. చక్కగా పండగా పూట టీవీల ముందు ఫ్యామిలీతో కూర్చొని మహేష్ బాబు మసాలా సినిమా గుంటూరు కారంని ఎంజాయ్ చేసేయండి.